
అందుగలడు.. ఇందు లేదని సందేహం వలదు.. అందందూ కరోనా గలదు అన్నట్టుగా మారింది ఈ మహమ్మారి విస్తృతి. టాలీవుడ్ లో ఇప్పటికే చాలా మందికి కరోనా సోకి వారిని ఐసోలోషన్ లోకి పంపింది. పవర్ స్టార్ పవన్, దిల్ రాజు సహా చాలా మంది ప్రముఖులు ఇప్పుడు చికిత్స పొందుతున్నారు. ఎవరినీ కరోనా వదలడం లేదు.
ఈక్రమంలోనే పెద్ద హీరోలను సైతం చుట్టుముడుతోంది. ఇటీవలే ‘సర్కార్ వారి పాట’లో పలువురికి కరోనా సోకడంతో సూపర్ స్టార్ మహేష్ సైతం క్వారంటైన్ లోకి వెళ్లారు.
తాజాగా మరో స్టార్ హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు కూడా కరోనా సోకింది. ఈ మేరకు ఆయనకు పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు టాలీవుడ్ వర్గాల సమాచారం.
కరోనా వచ్చినా.. కల్లోలంగా ఉన్న పుష్ప సినిమా షూటింగ్ ను సుకుమార్ కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం బన్నీ షూటింగ్ లో పాల్గొనడం లేదు. ఇతర తారాగణంపై సీన్లు తీస్తున్నారు.
అయితే అంతకుముందు షూటింగ్ లో పాల్గొన్నాడు. మరి ఎలా సోకిందో తెలియదు కానీ అల్లు అర్జున్ ను కరోనా వెంటాడి మరీ పట్టేసింది. ప్రస్తుతం బన్నీకి కరోనా సోకినట్లు తెలుస్తోంది. వెంటనే ఐసోలేషన్ లోకి వెళ్లినట్లు సమాచారం.