
భారీ భూకంపం సంభవించిన అసోం రాష్ట్రానికి అండగా ఉంటామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. భూకంపం నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులను తెలుసుకునేందుకు అసోం సీఎం సర్బానంద సోనోవాల్ తో మాట్లాడినట్లు మోదీ ట్వీట్ చేశారు. కేంద్రం నుంచి అసోంకు వీలైనంత సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. అసోం ప్రజలు క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు మోదీ తెలిపారు.