https://oktelugu.com/

పవన్ కొత్త సినిమాల పైన ఎఫెక్ట్ !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తూ వరుస సినిమాలకు సైన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే “పింక్’ తెలుగు రీమేక్ వకీల్ సాబ్, అలాగే క్రిష్ దర్శకత్వంలో మరో పిరియాడిక్ మూవీ చేస్తున్నాడు. కరోనా రాకపోయి ఉంటే ఈ పాటికి హరీష శంకర్ దర్శకత్వంలోనూ ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నానని పవన్ నుండి ఎనౌన్స్ కూడా వచ్చేది. కానీ కరోనా రాకతో వకీల్ సాబ్ సినిమా ఆగిపోవడం, పైగా ఇంకా షూట్ ఉండటం, దీనికి తోడు […]

Written By:
  • admin
  • , Updated On : July 12, 2020 / 11:18 AM IST
    Follow us on

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తూ వరుస సినిమాలకు సైన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే “పింక్’ తెలుగు రీమేక్ వకీల్ సాబ్, అలాగే క్రిష్ దర్శకత్వంలో మరో పిరియాడిక్ మూవీ చేస్తున్నాడు. కరోనా రాకపోయి ఉంటే ఈ పాటికి హరీష శంకర్ దర్శకత్వంలోనూ ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నానని పవన్ నుండి ఎనౌన్స్ కూడా వచ్చేది. కానీ కరోనా రాకతో వకీల్ సాబ్ సినిమా ఆగిపోవడం, పైగా ఇంకా షూట్ ఉండటం, దీనికి తోడు క్రిష్ సినిమాకి ఎక్కువ డేట్స్ కేటాయించాల్సి రావడంతో మొత్తానికి పవన్ తరువాత చేయాలనుకున్న సినిమాల పై బాగానే ఎఫెక్ట్ పడింది.

    ఇప్పటికే పవన్ ఒప్పుకున్న ప్రాజెక్ట్స్ అన్నీ వచ్చే ఏడాదికి కూడా పూర్తయ్యేలా కనిపించడం లేదు. పవన్ 2022లో కూడా సినిమాలు చేసే ఆలోచనలో ఉండటంతో దర్శకుడు డాలీ పవన్ ను అప్రోచ్ అయ్యాడని, డాలీ దరకత్వంలో సినిమా చేయడానికి పవన్ నుండి సానుకూల స్పందనే వచ్చిందని, అన్నీ కుదిరితే సినిమా ఓకే అయి, 2021 చివర్లో షూటింగ్ మొదలయ్యే అవకాశాలున్నట్టు ఇప్పటికే డాలీ నుండి ఆ మధ్య విన్నబడ్డ మాటలు.

    కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా ఉండకపోవచ్చు అట. పైగా పవన్ – డాలీ మధ్య సినిమాకి సంబంధించి ఎలాంటి కథా చర్చ కూడా జరగకపోవడంతో ఈ సినిమా క్యాన్సల్ చేయడానికి ఈజీ అయిందట. అలాగే కొంతమంది నిర్మాతలు కూడా పవన్ ను ఆ మధ్య సినిమా చేయమని అప్రోచ్ అయ్యారు. ఇక వాళ్ల సినిమమాల విషయంలో కూడా పవన్ ఇప్పట్లో సానుకూలంగా స్పందించే అవకాశం లేకుండా పోయింది.