కేసీఆర్ ఆగయా.. బ్యాటింగ్ మొదలెట్టాడా?

రెండు వారాల నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు కేసీఆర్ వచ్చాడు.. బ్యాటింగ్ మొదలుపెట్టాడు. మెజార్టీ రైతులను గురిపెట్టాడు. ఇన్నాళ్లు కేసీఆర్ ఎక్కడా? అంటూ తెలంగాణలో జరిగిన యాగీ అంతా ఇంతా కాదు.. కరోనా వైరస్ తీవ్రత వేళ కేసీఆర్ ఎక్కడికెళ్లారు? ఫాంహౌస్ కు ఎందుకు వెళ్లారు? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు తెలంగాణ సమాజంలో హాట్ టాపిక్ గా మారాయి. కొందరైతే ఏకంగా హైకోర్టుకు ఎక్కి కేసీఆర్ కనిపించడం లేదని పిటీషన్లు వేశారు. ప్రగతి భవన్ ఎదుట మరికొందరు ప్లకార్డులు […]

Written By: NARESH, Updated On : July 12, 2020 11:19 am
Follow us on


రెండు వారాల నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు కేసీఆర్ వచ్చాడు.. బ్యాటింగ్ మొదలుపెట్టాడు. మెజార్టీ రైతులను గురిపెట్టాడు. ఇన్నాళ్లు కేసీఆర్ ఎక్కడా? అంటూ తెలంగాణలో జరిగిన యాగీ అంతా ఇంతా కాదు.. కరోనా వైరస్ తీవ్రత వేళ కేసీఆర్ ఎక్కడికెళ్లారు? ఫాంహౌస్ కు ఎందుకు వెళ్లారు? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు తెలంగాణ సమాజంలో హాట్ టాపిక్ గా మారాయి. కొందరైతే ఏకంగా హైకోర్టుకు ఎక్కి కేసీఆర్ కనిపించడం లేదని పిటీషన్లు వేశారు. ప్రగతి భవన్ ఎదుట మరికొందరు ప్లకార్డులు ప్రదర్శించారు. కేసీఆర్ హైదరాబాద్ ఎప్పుడొస్తాడు? ఎప్పుడు కనిపిస్తాడు అన్నది హాట్ టాపిక్ గా మారిన వేళ సార్ వచ్చాడు అన్న కబురు అందింది.

కానీ ఎట్టకేలకు కేసీఆర్ వచ్చేశాడు. నిన్న కేసీఆర్ హైదరాబాద్ ప్రగతి భవన్ కు రావడంతో ఈ ఊహాగానాలకు తెరపడింది.. రెండు వారాల అజ్ఞాతవాసం తర్వాత హైదరాబాద్ జనారణ్యంలోకి కేసీఆర్ వచ్చాడు. రాగానే బ్యాంటింగ్ మొదలుపెట్టాడు.

నియంత్రిత సాగు, రైతుబంధు సహా రైతు సమస్యలనే ఎజెండా పెట్టుకొని నిన్న రాత్రి సమీక్షలో అందరికీ రైతుబంధు సాయం అందించాలని సూచించారు.

నిజానికి కేసీఆర్ ఎప్పుడు సమస్యలు వచ్చినా వాటిని చాకచక్యంగా పరిష్కరిస్తూ ముందుకెళుతుంటారు. సీఎం కేసీఆర్ మౌనం వెనుక పెద్ద ఉత్పాతమే ఉంటుందన్నది ఆయనను దగ్గరి నుంచి చూస్తున్న వారు చెప్పే మాట.. ఒకే సారి అదంతా బయటపడి ప్రత్యర్థులను చిత్తు చేసేలా ఆయన ఎత్తులుంటాయి.

కేసీఆర్ ఎప్పుడూ రాజకీయంగా వెనుకబడినా ఒకే ఒక స్టెప్ తో దాన్ని తనకు అనుకూలంగా మలుచుకుంటారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలోనూ 50రోజులకు పైగా మౌనంగా ఉండి ఒకేసారి వారికి వరాలిచ్చి దేవుడైపోయాడు. దిశా హత్యాచారం విషయంలో ఎన్ కౌంటర్ చేయించి హీరో అయిపోయాడు. ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి.

తెలంగాణలో కరోనాపై, సచివాలయం కూల్చివేతపై ప్రతిపక్షాలు, నెటిజన్లు, మేధావుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. జాతీయ మీడియాలోనూ కేసీఆర్ ఇంత క్లిష్ట సమయంలో సచివాలయం కోట కట్టడమేంటని ప్రశ్నించారు. వీటన్నింటిని గట్టి జవాబులు ఇచ్చేందుకు కేసీఆర్ పెద్ద ప్లాన్లు చేశారని టీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తెలంగాణలో మెజార్టీ అయిన రైతులను గుప్పిట పట్టిన కేసీఆర్.. వారికి రాగానే వరాలిచ్చారు. అన్ని విమర్శలకు ఒక్క సమీక్షతో చెక్ పెట్టాడు. తెలంగాణ రైతాంగానికి సాగు, రైతుబంధుపై అభయమిచ్చాడు. ఇలా కేసీఆర్ ఎప్పుడు తనపై విమర్శలు వచ్చినా ఒక్కదెబ్బతో వాటన్నింటిని పటాపంచలు చేస్తూ ముందుకెళ్లడం రివాజుగా పెట్టుకున్నాడు.ఇక కరోనా, సచివాలయం కూల్చివేతలపై ఈ రెండు మూడు రోజుల్లోనే సమాధానిమిస్తాడని తెలిసింది.

-ఎన్నం