Coolie Movie VS War 2 : సంక్రాంతికి కాకుండా, మిగిలిన రోజుల్లో రెండు పెద్ద సినిమాలు ఒకే రోజున విడుదల అవ్వడం అనేది ఈమధ్య కాలం లో ఎప్పుడూ జరగలేదు. సంక్రాంతి సినిమాలు కూడా ఒక్కే రోజున విడుదల అవ్వడం వంటివి జరగలేదు. కానీ ఈసారి రెండు భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రాలు ఒకే రోజున విడుదల కాబోతున్నాయి. ఒకటి ఎన్టీఆర్(Junior NTR), హృతిక్ రోషన్(Hrithik Roshan) కాంబినేషన్ లో తెరకెక్కిన ‘వార్ 2′(War 2 Movie) కాగా, మరొకటి సూపర్ స్టార్ రజినీకాంత్(Superstar Rajinikanth), లోకేష్ కనకరాజ్(Lokesh Kanagaraj) కాంబినేషన్ లో తెరకెక్కిన కూలీ. ‘వార్ 2’ నుండి ఇప్పటి వరకు ఎలాంటి ప్రమోషనల్ కంటెంట్ బయటకు రాలేదు కాబట్టి, ప్రస్తుతానికి కూలీ చిత్రం మీదనే అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నెల 20 న ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ‘వార్ 2’ టీజర్ ని విడుదల చేయబోతున్నారు. అప్పటి నుండి ఈ సినిమాపై కూడా అంచనాలు ఏర్పడొచ్చు.
Also Read : రావణుడి భార్య గా కాజల్ అగర్వాల్..కెరీర్ ని మలుపు తిప్పే అవకాశం!
ఈ రెండు సినిమాలు కూడా ఆగష్టు 14 న విడుదల కాబోతున్నాయి. ఒకే రోజున విడుదల అవ్వబోతున్న ఈ రెండు సినిమాలలో ఏ చిత్రానికి ఎక్కువ నష్టం రావొచ్చు అనేది ఇప్పుడు మనం చూద్దాం. రజినీకాంత్ కి మొదటి నుండి తెలుగు లో మంచి మార్కెట్ ఉంది. పైగా ఈ చిత్రానికి లోకేష్ కనకరాజ్ దర్శకుడు, నాగార్జున కూడా ఇందులో నటించాడు కాబట్టి ఈ చిత్రానికి తెలుగు స్టార్ హీరో సినిమాకు ఉన్నంత క్రేజ్ ఉంటుంది. ఇక ఎన్టీఆర్ ‘వార్ 2’ చిత్రానికి హిందీ లో హృతిక్ రోషన్ స్టార్ స్టేటస్ ఉపయోగపడుతుంది, కానీ తెలుగు వెర్షన్ ఆ రేంజ్ లో ఉండే అవకాశం లేదు . ఎందుకంటే ఇందులో ఎన్టీఆర్ హీరో కాదు, నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారక్టర్ చేస్తున్నాడు. పైగా హిందీ డబ్బింగ్ సినిమా లాగా ఉంటుంది కాబట్టి, ఈ చిత్రానికి రెగ్యులర్ ఎన్టీఆర్ సినిమాలకు ఉన్నంత క్రేజ్ ఉండకపోవచ్చు.
ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి వంద కోట్ల రూపాయలకు కూడా జరగలేదు అంటేనే అర్థం చేసుకోవచ్చు ఈ సినిమా కు ప్రస్తుతం ఉన్న హైప్. అంతే కాకుండా ఈ చిత్రానికి తమిళనాడు లో చాలా లిమిటెడ్ షోస్ ని మాత్రమే కేటాయిస్తారు. ఎందుకంటే అక్కడ కూలీ మెయిన్ సినిమా కాబట్టి. అదే మన తెలుగు లో కూలీ చిత్రానికి ఎక్కువ షోస్ ఇస్తామనుకోండి అది వేరే విషయం. మొత్తం మీద సౌత్ మార్కెట్ లో వార్ 2 కి ఎక్కువ గా డెంట్ పడేలా ఉంది. హిందీ లో కూలీ కి ఎలాగో మార్కెట్ లేదు కాబట్టి, అక్కడ నుండి ‘వార్ 2’ కి భారీ వసూళ్లు రావొచ్చు. కానీ సౌత్ లో మాత్రం క్లాష్ కారణంగా కనీసం 20 నుండి 30 కోట్ల నష్టాన్ని ‘వార్ 2’ ఎదురుకోవాల్సి ఉంటుంది