కానీ హీరోయిన్ రోల్స్ చేయకపోయినా మంచి క్యారెక్టర్స్ చేస్తే చాలు అనుకునే అభిమానులు కూడా ఉన్నారు. వాళ్లకు రాబోయే రోజుల్లో కాజల్ అగర్వాల్ సెకండ్ ఇన్నింగ్స్ గొప్ప థియేట్రికల్ అనుభూతిని కలిసాగిస్తుందని చెప్పొచ్చు. రీసెంట్ గానే ఆమె మంచు విష్ణు డ్రీం ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ లో పార్వతి రోల్ లో నటించింది. ఈ సినిమా వచ్చే నెల 27 న విడుదల కాబోతుంది. ఇప్పుడు ఆమె మరో అద్భుతమైన క్యారక్టర్ ని సొంతం చేసుకున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త. విషయంలోకి వెళ్తే హిందీ లో రణబీర్ కపూర్, సాయి పల్లవి, యాష్ కాంబినేషన్ లో ‘రామాయణ్’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో రాముడిగా రణబీర్ కపూర్(Ranbir Kapoor), సీతగా, సాయి పల్లవి(Sai Pallavi), రావణాసురిడిగా యాష్(Rocking Star Yash) నటిస్తున్నాడు.
ఈ చిత్రం లో రావణుడు, అంటే యాష్ కి జోడీగా కాజల్ అగర్వాల్ నటించనుంది. అంటే రావణుడి భార్య మండోదరి క్యారక్టర్ చేస్తుంది అన్నమాట. రావణాసురుడిది నెగటివ్ క్యారక్టర్ అయ్యినప్పటికీ, ఆయన భార్య మండోదరి క్యారక్టర్ మాత్రం పాజిటివ్ గానే ఉంటుంది. నటనకు మంచి స్కోప్ ఉన్న పాత్ర కూడా. సెకండ్ ఇన్నింగ్స్ లో మళ్ళీ ఆమె సందడి మునుపటి వైభోగాన్ని గుర్తు చేయొచ్చు. వరుసగా మళ్ళీ ఆఫర్స్ క్యూలు కట్టొచ్చు. ఇకపోతే ఇదే సినిమాలో మరో స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సూర్పనక్క క్యారక్టర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇన్ని రోజులు క్యూట్ రోల్స్ లో కనిపించిన రకుల్ ప్రీత్ సింగ్ తొలిసారి ఒక నెగటివ్ క్యారక్టర్ లో కనిపించనుంది. షూటింగ్ కార్యక్రమాలను శరవేగంగా జరుగుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.