Coolie Movie Second Half Review: ఈమధ్య విడుదల అవుతున్న సినిమాల్లో సెకండ్ హాఫ్ మీద భారీ కంప్లైంట్స్ వస్తున్నాయి. డైరెక్టర్స్ ఫస్ట్ హాఫ్ అద్భుతంగా తీస్తున్నారు, కానీ సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి వాళ్లకు ఏమైపోతుందో ఏంటో అసలు అర్థం కావడం లేదు. జులై 24 న విడుదలైన ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) కి ఇదే సమస్య, జులై 31 న విడుదలైన ‘కింగ్డమ్'(Kingdom Movie) చిత్రానికి ఇదే సమస్య. ఇప్పుడు ఆగష్టు 14 న విడుదల అవ్వబోతున్న క్రేజీ చిత్రం ‘కూలీ'(Coolie Movie) కి కూడా ఇదే సమస్య. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం ఫస్ట్ హాఫ్ వేరే లెవెల్ లో ఉంటుందని, కానీ సెకండ్ హాఫ్ మాత్రం అనుకున్న స్థాయిలో లేదని అంటున్నారు. డైరెక్టర్ లోకేష్ కనకరాజ్(Lokesh Kanagaraj) గత చిత్రం ‘లియో’ కి కూడా ఇదే సమస్య. ఫస్ట్ హాఫ్ క్రేజీ గా తీసాడు, కానీ సెకండ్ హాఫ్ తేలిపోయేలా చేసాడు.
Also Read: OG..ఓజాస్..గంభీరా.. ఒక్క పాటతోనే సునామీ సృష్టించేశారుగా!
ఫలితంగా వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సిన ఈ సినిమా కేవలం 600 కోట్ల రూపాయిల గ్రాస్ వద్దనే ఆగిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు కూలీ చిత్రానికి భారీ హైప్ ఉంది, ఈ సినిమా అద్భుతంగా ఉండాల్సిన అవసరమే లేదు, యావరేజ్ రేంజ్ లో ఉన్నా బాక్స్ ఆఫీస్ ని దున్నేస్తాది, కానీ సెకండ్ హాఫ్ మాత్రం కనీసం యావరేజ్ రేంజ్ లో అయినా ఉండాలి. లేకపోతే మాత్రం మొత్తానికే మోసం వస్తాది. నేడు ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ విడుదల కాబోతుంది. ఈ ట్రైలర్ తో సినిమా స్టోరీ ఏంటి అనేది అందరికీ ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పటి వరకు మేకర్స్ ఈ చిత్రం స్టోరీ లైన్ ని లీక్ కానివ్వకుండా చాలా జాగ్రత్త పడ్డారు. కేవలం పాటలు మాత్రమే విడుదల అయ్యాయి, వాటి ద్వారా స్టోరీ ని అంచనా వేయడానికి లేదు.
Also Read: టాలీవుడ్ వేదన : జనాలు థియేటర్లకు రావడం లేదు.. సినిమా చూడట్లేదు!
అలా డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ ఆడియన్స్ లో సినిమా పట్ల ఆతృతగా ఎదురు చూసేలా చేసాడు. చాలా మంది ఈ సినిమాకు ట్రైలర్ కూడా ఉండదని, డైరెక్ట్ గా థియేటర్స్ లోనే సినిమాని చూసుకోవాల్సి ఉంటుందేమో అని అనుకున్నారు. కానీ అభిమానుల ఒత్తిడి కారణం చేత థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేస్తున్నారు. ఇప్పటికే అనిరుద్ అందించిన అద్భుతమైన పాటల కారణంగా ఈ సినిమా పై కనీవినీ ఎరుగని అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు థియేట్రికల్ ట్రైలర్ కాస్త సహకరిస్తే ఈ చిత్రం మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబడుతుంది. తెలుగు లో అయితే ‘వార్ 2’ ని డామినేట్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అలా ఉంది పరిస్థితి మరీ. చూడాలి మరి థియేట్రికల్ ట్రైలర్ ఎలా ఉండబోతుంది అనేది. ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు A సర్టిఫికేట్ ని జారీ చేశారు.