Hari Hara Veeramallu Vs Kingdom: వారం గ్యాప్ లో విడుదలయ్యే రెండు సినిమాల్లో, ముందుగా వచ్చే సినిమాకు నెగిటివ్ టాక్ వస్తే, తర్వాత రాబోయే సినిమా పై ప్రేక్షకుల్లో కానీ, ట్రేడ్ లో కానీ మంచి అంచనాలు ఉంటాయి. అలా భారీ అంచనాల నడుమ విడుదలయ్యే రెండో సినిమా కూడా ఫ్లాప్ అయితే, వారం క్రితం వచ్చిన సినిమాకు కాస్త వసూళ్లు పెరగడం అనేది మనం చాలా కాలం నుండి చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ‘కింగ్డమ్'(Kingdom Movie), ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్రాల పరిస్థితి అలాగే ఉంది. జులై 24 న భారీ అంచనాల నడుమ విడుదలైన ‘హరి హర వీరమల్లు’ చిత్రానికి ప్రీమియర్ షోస్ నుండే ఘోరమైన డిజాస్టర్ టాక్ వచ్చింది. రెండవ రోజు ఆ టాక్ ప్రభావం దారుణంగా సినిమా కలెక్షన్స్ పై పడడంతో డిజాస్టర్ కా బాప్ కలెక్షన్స్ నమోదు అయ్యాయి. కానీ మూడవ రోజు, నాల్గవ రోజున ఫ్యామిలీ ఆడియన్స్ కారణంగా కాస్త డీసెంట్ స్థాయి వసూళ్లు నమోదు అయ్యాయి.
Also Read: చిన్న తేడా వచ్చినా గల్లంతే..లోకేష్ కనకరాజ్ కొంప ముంచాడుగా!
ఇక ఆ తర్వాత నాల్గవ రోజు నుండి వసూళ్లు ఊహించినట్టు గానే దారుణంగా పడిపోయాయి, అనేక సెంటర్స్ లో డెఫిసిట్స్ కూడా నమోదు అయ్యాయి. అలాంటి సినిమాకు విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) ‘కింగ్డమ్’ చిత్రం కాస్త ఊపిరి పోసింది అని చెప్పొచ్చు. ముఖ్యంగా మాస్ సెంటర్స్ లో టాక్ లేకపోవడం తో ‘కింగ్డమ్’ చిత్రం మొదటి రోజే భారీగా పడిపోయింది. ఇక రెండవ రోజు అయితే ఫస్ట్ షోస్ నుండి అనేక మాస్ సెంటర్స్ లో హరి హర వీరమల్లు డైలీ కలెక్షన్స్ కంటే తక్కువ నమోదు అయ్యాయి. ముఖ్యంగా కృష్ణ జిల్లాలో అయితే దారుణం. విజయవాడ లో నిన్న ఒక థియేటర్ లో కింగ్డమ్ చిత్రానికి 15 వేల రూపాయిల గ్రాస్ వసూళ్లు వస్తే, ‘హరి హర వీరమల్లు’ చిత్రానికి 18 వేల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
Also Read: జై హనుమాన్ తో ప్రశాంత్ వర్మ దేశాన్ని ఆకర్షిస్తారా..?
ఉత్తరాంధ్ర, నెల్లూరు, గుంటూరు జిల్లాలో కూడా ఇదే పరిస్థితి. దీంతో ‘హరి హర వీరమల్లు’ చిత్రానికి నిన్న, అనగా 9వ రోజున 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అంతకు ముందు రోజున ఈ చిత్రానికి 35 లక్షల రూపాయిలు వచ్చాయి. అంటే దాదాపుగా 15 లక్షల రూపాయిలు పెరిగాయి అన్నమాట. దీనిని బట్టీ చూస్తుంటే ఈరోజు రేపు ‘హరి హర వీరమల్లు’ చిత్రానికి డీసెంట్ స్థాయి వసూళ్లు నమోదు అయ్యేలా కనిపిస్తున్నాయి. శనివారం రోజున 80 లక్షలు, ఆదివారం రోజున కోటి రూపాయిల షేర్ వసూళ్లు రావొచ్చు. ఈ వీకెండ్ తోనే ‘హరి హర వీరమల్లు’ చిత్రం వసూళ్లు కూడా క్లోజ్ అయిపోతాయని అందరూ అనుకుంటున్నారు. ఓటీటీ లోకి కూడా ముందు అనుకున్న తేదీ కంటే ముందే రావొచ్చు అంట. చూడాలి మరి.