Coolie Movie : అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) కేవలం నటించడమే కాదు, సినిమాలను నిర్మించడం, ఇతర భాషలకు చెందిన సినిమాలను డబ్ చేసి తెలుగు లో విడుదల చేయడం వంటివి దశాబ్దాల నుండి చేస్తూనే ఉన్నాడు. ఇప్పటి వరకు ఆయన విడుదల చేసిన సినిమాలలో అత్యధిక శాతం సూపర్ హిట్ అయ్యినవే. చివరిసారిగా ఆయన విడుదల చేసిన డబ్ చిత్రం ‘సర్దార్’. కార్తీ హీరో గా నటించిన ఈ సినిమా తెలుగు లో కూడా భారీ హిట్ అయ్యి నాగార్జునకు లాభాలు తెచ్చిపెట్టింది. ఇకపోతే రీసెంట్ గానే ఆయన సూపర్ స్టార్ రజినీకాంత్(Super star Rajinikanth) తో కలిసి ‘కూలీ'(Coolie Movie) అనే చిత్రం లో నటించిన సంగతి తెలిసిందే. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకుంది. ఆగష్టు 13న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతుంది.
Also Read : నాని హిట్ 3 ఓటీటీలో, అధికారిక ప్రకటన, ఎక్కడ చూడొచ్చంటే?
అయితే ఈ సినిమా తెలుగు వెర్షన్ థియేట్రికల్ రైట్స్ కోసం అక్కినేని నాగార్జున కూడా రేస్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ అధినేత నాగవంశీ ఈ చిత్రాన్ని 40 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మేకర్స్ మాత్రం నాగార్జున కి ఇచ్చేందుకే ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నారట. నాగ వంశీ కంటే నాగార్జున మరో పది కోట్ల రూపాయిలు ఎక్కువా ఆఫర్ చేసినట్టు తెలుస్తుంది. తెలుగు వెర్షన్ కి సంబంధించిన రజినీకాంత్ సినిమాకు ఈ రేంజ్ బిజినెస్ జరిగి 8 ఏళ్ళు అయ్యింది. ఆయన గత చిత్రాలకు ఇక్కడ పాతిక కోట్ల రూపాయిల బిజినెస్ కూడా జరగలేదు. రీసెంట్ కాలం లో ఏ రజినీకాంత్ సినిమాకు రానంత క్రేజ్ ఈ సినిమాకు వచ్చిందంటే అందుకు కారణం ఈ చిత్రానికి లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించడమే. దానికి తోడు నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర వంటి సూపర్ స్టార్స్ కూడా ఈ సినిమాలో భాగం అవ్వడం ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచింది.
ఒకవేళ ఈ సినిమా తెలుగు వెర్షన్ రైట్స్ అక్కినేని నాగార్జున కి వెళ్తే ఆయన జాక్పాట్ కొట్టినట్టే అనుకోవచ్చు. ఎందుకంటే కేవలం మొదటి వీకెండ్ లోనే రీకవర్ అయిపోయేంత టార్గెట్ అది. ఫుల్ రన్ లో కచ్చితంగా వంద కోట్ల రూపాయిల థియేట్రికల్ షేర్ తెలుగు వెర్షన్ కి వస్తుంది. అంటే లాభాలు 50 కోట్ల రూపాయిల పైమాటే. ఈమధ్య కాలంలో నాగార్జున కి ఈ రేంజ్ లాభాలు సినిమా నుండి రాలేదని అనుకోవచ్చు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈ చిత్రానికి ఇంకా ఎంత క్రేజ్ పెరుగుతుంది అనేది. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రం లో హీరోయిన్ గా శృతి హాసన్ నటించగా, పూజా హెగ్డే ఒక ఐటెం లో సాంగ్ లో కనిపించనుంది.