Vijayasai Reddy Counter On Jagan: మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి( Vijaya Sai Reddy ) యాక్షన్ లోకి దిగారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసుకున్నారు. ఇటీవల మద్యం కుంభకోణం విషయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు జగన్. ఈ క్రమంలో విజయసాయిరెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేశారు. దానికి తాజాగా కౌంటర్ ఇచ్చారు విజయసాయిరెడ్డి. జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశంపై స్పందించారు. నేను మారను.. నా వ్యక్తిత్వం ఎప్పుడు ఇలానే ఉంటుంది. పదవి వచ్చాక నువ్వే మారిపోయావు. నేను ఎప్పుడూ ఇలాగే ఉన్నాను. మూడు దశాబ్దాలుగా నాకు రాజశేఖరరెడ్డి కుటుంబంతో సంబంధాలు ఉన్నాయి. నేను ప్రలోభాలకు లొంగను. ఎవరికి భయపడను అంటూ విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు.
* వరుస అరెస్టులు..
మద్యం కుంభకోణం( liquors camp కేసులో వరుస అరెస్టులు జరుగుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసే సమయంలో.. ఓ కేసు విచారణకు హాజరయ్యారు విజయసాయిరెడ్డి. మద్యం కుంభకోణంలో రాజ్ కసిరెడ్డి కర్త,కర్మ, క్రియ అంటూ చెప్పుకొచ్చారు. తనకు పిలిస్తే ఆధారాలు సైతం చూపిస్తానని చెప్పుకొచ్చారు. అటు తరువాత సిట్ అరెస్టుల పర్వం ప్రారంభించింది. రాజ్ కసిరెడ్డి తో పాటు ఆయన ప్రధాన అనుచరుడిని అదుపులోకి తీసుకుంది. అటు తరువాత అప్పటి సీఎమ్ఓ అధికారి ధనుంజయ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఓ ఎస్ డి కృష్ణమోహన్ రెడ్డిలను సైతం అరెస్టు చేశారు. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు గోవిందప్ప బాలాజీని సైతం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. జగన్మోహన్ రెడ్డిని సైతం అరెస్టు చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో జగన్ మీడియా ముందుకు వచ్చారు. సుదీర్ఘంగా నాలుగు గంటలపాటు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. విజయసాయిరెడ్డిని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. దానికి ఇప్పుడు బదులు ఇచ్చారు విజయసాయిరెడ్డి.
* తీవ్రస్థాయిలో కామెంట్స్..
ఇప్పటివరకు విజయసాయిరెడ్డి పై జగన్మోహన్ రెడ్డి ఆ స్థాయిలో వ్యాఖ్యలు చేయలేదు. చంద్రబాబుకు లొంగిపోయిన వ్యక్తిగా అభివర్ణించారు. రాజ్యసభ పదవీకాలం మూడేళ్లు ఉండగా.. చంద్రబాబు కూటమికి మేలు చేసేందుకు తన రాజ్యసభ సభ్యత్వాన్ని రాజీనామా చేశాడని విమర్శించారు. అమ్ముడుపోయారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే దీని పైనే తాజాగా స్పందించారు విజయసాయిరెడ్డి. జగన్మోహన్ రెడ్డి కి కౌంటర్ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మారిపోయింది జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకొచ్చారు. తాను మారిపోయాను అనడంలో వాస్తవం లేదని తేల్చేశారు.
*విజయసాయిరెడ్డి వ్యాఖ్యలతో..
ఈ ఏడాది జనవరిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు విజయసాయిరెడ్డి. పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ పదవిని సైతం వదులుకున్నారు. మరో మూడేళ్ల పదవీకాలం ఉండగానే రాజీనామా చేశారు. అయితే తన రాజీనామాతో కూటమికి మేలు జరుగుతుందని చెప్పుకొచ్చారు. ఇప్పుడు అదే మాటను జగన్మోహన్ రెడ్డి హైలెట్ చేస్తున్నారు. కానీ కొత్తగా అమ్ముడు పోయారన్న వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే విజయసాయిరెడ్డి చాలా కూల్ గానే సమాధానం చెప్పడం ఆశ్చర్యం వేస్తోంది.