War 2 Pre Release Event Cost: మరో రెండు రోజుల్లో ఎన్టీఆర్(Junior NTR),హృతిక్ రోషన్(Hrithik Roshan) కలిసి నటించిన ‘వార్ 2′(War 2 Movie) చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ నేపథ్యం లో మేకర్స్ నిన్న అట్టహాసం గా హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. సినిమాకు కావాల్సిన బజ్ ని ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ జనరేట్ చేయడం లో కొంతమేరకు విజయవంతం అయ్యింది. అంటే ఇంతకు ముందు చాలా మందికి ఈ సినిమా అనేది ఒకటి ఉందనే విషయం కూడా తెలియదు, కానీ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత బయట జనాలకు కూడా ఎన్టీఆర్ నుండి ఒక సినిమా వస్తుందని తెలిసింది. నిర్మాత నాగవంశీ కారణంగానే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ సాధ్యమైంది. ఎందుకంటే ఈ చిత్ర నిర్మాణ సంస్థ ఇలాంటి ఈవెంట్స్ కి సాధ్యమైనంత వరకు దూరంగా ఉంటుంది.
Also Read: ఈసారి మిస్ అవ్వదు..ప్రభాస్ పెళ్లి పై పెద్దమ్మ శ్యామలాదేవి ఆసక్తికరమైన వ్యాఖ్యలు!
కానీ నాగవంశీ పట్టుబట్టి మరీ ఈ ఈవెంట్ ని పెట్టించడం తో అతను అనుకున్న టార్గెట్ ని కొంతమేరకు చేరుకోగలిగాడు. అంతే కాకుండా నిన్నటి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన మాట్లాడిన మాటలు కూడా బాగా వైరల్ అయ్యాయి. సినిమాలో ఇంత విషయం ఉందా అంటూ ఆయన ప్రసంగాన్ని చూసిన ప్రతీ ఒక్కరు అనుకుంటున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏర్పాటు చేయడానికి యాష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ దాదాపుగా కోటి 70 లక్షల రూపాయలకు పైగా ఖర్చు చేసిందట. రీసెంట్ గా జరిగిన ఈవెంట్స్ లో ఇదే అత్యధికం అని చెప్పొచ్చు. ఈ రేంజ్ బడ్జెట్ కొంతమంది డైరెక్టర్స్ కి ఉంటే బలగం లాంటి చిత్రాలను తియ్యగలరు. అయితే ఈ బడ్జెట్ పై కూడా ఇప్పుడు సోషల్ మీడియా లో ట్రోల్స్ నడుస్తున్నాయి. ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ అత్యంత దారుణంగా ఉన్న విషయం నిర్మాత నాగవంశీ దృష్టికి వెళ్ళింది.
దీంతో ఆయన ఆ చిత్ర నిర్మాతలతో ఇంత డబ్బులు ఖర్చు చేయించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏర్పాటు చేయించాడు. కానీ నార్త్ అమెరికా లో అడ్వాన్స్ బుకింగ్స్ రోజు వచ్చే గ్రాస్ కంటే మరో 20 వేల గ్రాస్ ఎక్కువగా వచ్చిందంటే. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం కేవలం 40 నుండి 50 లక్షల రూపాయిల గ్రాస్ మాత్రమే వచ్చింది. కోటి 75 లక్షల రూపాయిలు ఖర్చు చేస్తే, వచ్చిన వసూళ్లు కేవలం 40 లక్షలు మాత్రమే, నిర్మాతకు కోటి రూపాయలకు పైగా నష్టం పాపం అంటూ సోషల్ మీడియా లో ఎన్టీఆర్ యాంటీ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఇండియా వైడ్ గా అన్ని ప్రాంతాల్లో మొదలైంది. ఆంధ్ర ప్రదేశ్ లో కాసేపటి క్రితమే బుకింగ్స్ ని మొదలు పెట్టారు. తెలంగాణ లో టికెట్ రేట్స్ హైక్స్ కోసం ఎదురు చూస్తున్నారు.