Allu Arjun And Trivikram: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అల్లు అర్జున్ కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవెల్లో నిలుచోబెట్టాయి. ఇక మొదట చేయబోయే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకుంటాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…ప్రస్తుతం ఆయన అట్లీ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నాడు. ఇక ఇప్పటికే ‘పుష్ప 2’ సినిమాతో పెను ప్రభంజనాన్ని సృష్టించిన ఆయన 1850 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబట్టి ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులను క్రియేట్ చేశాడు. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ప్రస్తుతం పాన్ ఇండియా నెంబర్ వన్ ఇండస్ట్రీ గా కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం మన హీరోలందరు స్టార్ హీరోలుగా వెలుగొందడమే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ని రూల్ చేసే హీరో ఎవరు అనేది తెలుసుకోవడానికి ఇండియన్ సినిమా ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read: రచ్చ రంబోలా.. నాని ప్యారడైజ్ తో ఏదో చేసేలా ఉన్నాడే..!
అయితే ఇండియాలో ఉన్న టాప్ హీరోలందరిలో ఇప్పుడు మన తెలుగు హీరోలకే నెంబర్ వన్ పొజిషన్ దక్కించుకునే అవకాశాలైతే ఉన్నాయి. మరి వాళ్ళు ఎవరు ఎలాంటి పొజిషన్ ను సంపాదించుకుంటారు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది…ఇక ఏది ఏమైనా కూడా అట్లీ కాంబినేషన్ సెట్ అయిన వెంటనే అల్లు అర్జున్ అభిమానులు చాలా వరకు ఆనందపడ్డారు.
నిజానికి అల్లు అర్జున్ త్రివిక్రమ్ తో ఒక సినిమా చేయాల్సింది కానీ త్రివిక్రమ్ త్వరగా చేసిన ‘గుంటూరు కారం’ సినిమా ఫ్లాప్ అవ్వడంతో అల్లు అర్జున్ త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి కొంతవరకు తెరపడినట్టుగా తెలుస్తోంది. అందుకోసమే తను అట్లీని సెలెక్ట్ చేసుకున్నాడు… త్రివిక్రమ్ ను రిజెక్ట్ చేసి మరి అట్లీ కి ఛాన్స్ ఇచ్చిన అల్లు అర్జున్ నమ్మకాన్ని నిలబెడతాడా? లేదా?
అనేది ఇప్పుడు చర్చనీయంశంగా మారింది. నిజానికి త్రివిక్రమ్ అభిమానులు మాత్రం కొంతవరకు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కారణం ఏంటి అంటే అల్లు అర్జున్ కి ప్రస్తుతం స్టార్ హీరో రేంజ్ లో ఉండటానికి కారణం కూడా త్రివిక్రమ్ గారే కావడం విశేషం…అలాంటి త్రివిక్రమ్ గారిని రిజెక్ట్ చేసే స్థాయికి అల్లు అర్జున్ ఎదిగిపోయాడా అనే ధోరణి లో కూడా కొన్ని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి…