Coolie Movie Remuneration: సూపర్ స్టార్ రజనీకాంత్(Superstar Rajinikanth), లోకేష్ కనకరాజ్(Lokesh Kanagaraj) కాంబినేషన్ లో తెరకెక్కిన కూలీ(Coolie Movie) చిత్రం ఆగష్టు 14 న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల కాబోతుంది. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు పూర్తి అయ్యి చాలా రోజులే అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఫుల్ బిజీ గా ఉంది మూవీ టీం. ఈ చిత్రం నుండి పెద్ద కంటెంట్ ఇప్పటి వరకు బయటకు రాలేదు. మొన్న విడుదల చేసిన పూజ హెగ్డే(Pooja Hegde) ‘మోనికా’ స్పెషల్ సాంగ్ పెద్ద హిట్ అయ్యింది, ఈ సినిమా పై అంచనాలు మరింత పెంచేలా చేసింది. కానీ ఈ ప్రాజెక్ట్ ప్రకటించినప్పటి నుండే క్రేజ్ వేరే లెవెల్ లో ఉండేది. అందుకే టీజర్, ట్రైలర్ విడుదల కాకపోయినా బిజినెస్ హాట్ కేక్ లాగా అమ్ముడుపోయింది. అలా అమ్ముడుపోడానికి ముఖ్య కారణం కాంబినేషన్ పవర్.
Also Read: రష్మికకు భారీ షాక్… సమంత అంత తోపా?
లోకేష్ కనకరాజ్ తో రజినీకాంత్ సినిమా అంటే ఆ మాత్రం ఉంటుంది. అలాంటిది ఆ కాంబినేషన్ లో అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna), ఉపేంద్ర(Nimma Upendra), సౌబిన్ సాహిర్(Soubhin Sahir) వంటి వారు నటించడం, అమీర్ ఖాన్(Aamir Khan) లాంటి సూపర్ స్టార్ గెస్ట్ రోల్ చేయడం ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఉండడం తో ఈ సినిమా పై ప్రతీ ఒక్కరు అంచనాలు భారీగా పెంచుకున్నారు. మేకింగ్ కాస్ట్ పెద్దగా ఉండకపోయి ఉండొచ్చు. కానీ స్టార్ క్యాస్ట్ కి మాత్రం భారీ గానే ఖర్చు చేశారు నిర్మాతలు. ఒక్కొక్కరు ఎంత రెమ్యూనరేషన్ అందుకున్నారో ఒకసారి చూద్దాం. ఈ చిత్రానికి దర్శకత్వం వహించినందుకు డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దాదాపుగా 50 కోట్ల వరకు రెమ్యూనరేషన్ ని అందుకున్నాడట. ఈ విషయాన్ని రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో స్వయంగా లోకేష్ తెలిపాడు. ఇక మిగిలిన ఆర్టిస్టుల రెమ్యూనరేషన్ విషయానికి వస్తే హీరోగా నటించిన రజనీకాంత్ అక్షరాలా 150 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకున్నాడట.
Also Read: అతని మరణం, అక్షయ్ కుమార్ చేసిన పని తెలిస్తే భేష్ అంటారు!
అదే విధంగా విలన్ గా చేసిన అక్కినేని నాగార్జున 24 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకున్నట్టు సమాచారం. ఇది ఆయన కెరీర్ హైయెస్ట్ రెమ్యూనరేషన్ అనొచ్చు. ఇన్ని రోజులు హీరో గా చేసిన నాగార్జున పది కోట్ల రూపాయలకు మించి రెమ్యూనరేషన్ ని అందుకోలేదు. అదే విధంగా అమీర్ ఖాన్ ఈ చిత్రం లో అతిథి పాత్ర పోషించినప్పటికీ పాతిక కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ అందుకున్నట్టు సమాచారం. క్లైమాక్స్ లో వచ్చే పాత్ర అయినా సినిమాపై చాలా బలమైన ప్రభావం చూపించే క్యారక్టర్ అట. అదే విధంగా ఉపేంద్ర పది కోట్ల రూపాయిలు, శృతి హాసన్ హాసన్ నాలుగు కోట్ల రూపాయిలు, పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ చేసినందుకు రెండు కోట్ల రూపాయిలు, సౌబిన్ సాహిర్ కి 7 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ అందినట్టు తెలుస్తుంది.