Coolie Movie advance bookings Kerala: సూపర్ స్టార్ రజనీకాంత్(Superstar Rajinikanth) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘కూలీ'(Coolie Movie) ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పై అంచనాలు కనీవినీ ఎరుగని రేంజ్ లో ఉన్నాయి. రజనీకాంత్ సినిమా అంటే సాధారణంగానే అంచనాలు భారీగా ఉంటాయి. దానికి తోడు లోకేష్ కనకరాజ్(Lokesh Kanagaraj) లాంటి టాప్ మోస్ట్ డైరెక్టర్ తోడు అయితే ఇక ఆ అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ఎవ్వరూ ఊహించలేరు. అందుకు తగ్గట్టుగానే నార్త్ అమెరికా బుకింగ్స్ జరిగాయి. ఈ సినిమా విడుదలయ్యే రోజునే ‘వార్ 2’ కూడా విడుదల అవుతుంది. ఐమాక్స్ మరియు ఇతర ఫార్మాట్స్ థియేటర్స్ మొత్తం వార్ 2 కి వెళ్లాయి. అయినప్పటికీ కూడా ఈ చిత్రానికి వెయ్యి షోస్ మీద 32 శాతం ఆక్యుపెన్సీ తో 1.2 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
Read Also: ది ప్యారడైజ్’ నుండి నాని ఫస్ట్ లుక్ వచ్చేసింది..ఈ ‘జడల్’ ఏంటయ్యా బాబు!
దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు ఈ సినిమా రేంజ్ ఏమిటి అనేది. నార్త్ అమెరికా లోనే ఈ రేంజ్ బుకింగ్స్ ఉన్నాయంటే, ఇక ఇండియా లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాక ఏ రేంజ్ లో ఉంటుందో అని అభిమానులు అంచనా వేసుకున్నారు. నేడు కేరళ ప్రాంతం లో అడ్వాన్స్ బుకింగ్స్ అన్ని ప్రాంతాల్లోనూ ఒకేసారి మొదలయ్యాయి. రెస్పాన్స్ మామూలు రేంజ్ లో లేదు. బుక్ మై షో యాప్ లో గంటకు 50 వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. కేరళ లాంటి చిన్న ఇండస్ట్రీ నుండి ఈ రేంజ్ లో టికెట్స్ అమ్ముడుపోవడం అనేది సాధారణమైన విషయం కాదు. మన తెలుగు హీరోలలో అల్లు అర్జున్, ప్రభాస్ వంటి వారికి ఇండియా వైడ్ గా అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభిస్తే ఈ స్థాయి బుకింగ్స్ జరిగాయి. దీనిని బట్టి రజనీకాంత్ కి కేరళలో ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనేది అర్థం చేసుకోవచ్చు.
Read Also: ఓజీ ‘ఫైర్ స్ట్రోమ్’ పాటలో కనిపించిన ఈమె ఎవరో తెలుసా ? ఆమె బ్యాక్ గ్రౌండ్ చూస్తే ఆశ్చర్యపోతారు!
ఇదంతా పక్కన పెడితే రజనీకాంత్ కంటే కేరళలో విజయ్ కి ఇంకా ఎక్కువ క్రేజ్ ఉంది. ఆయన హీరో గా నటించిన లియో చిత్రానికి గంటకి కేరళ మార్కెట్ నుండి 80 వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. ఇప్పటికీ తమిళ సినిమాల్లో ఇదే ఆల్ టైం రికార్డు. కూలీ చిత్రం 50 వేల వరకు ట్రెండ్ అయ్యి మధ్యలో పడిపోయింది. కానీ ఈ వయస్సు లో కూడా రజినీకాంత్ నేటి తరం సూపర్ స్టార్స్ కి పోటీ ఇవ్వడం అనేది కచ్చితంగా అసాధారణమైన విషయమే. ఇక ఈ ‘కూలీ’ చిత్రానికి టాక్ రావడం ఒక్కటే బ్యాలన్స్ ఉంది. డిజాస్టర్ టాక్ కాకుండా, మామూలు యావరేజ్ రేంజ్ టాక్ వచ్చినా ఈ సినిమా కి వెయ్యి కోట్ల గ్రాస్ రావడం చాలా తేలిక అని అంటున్నారు. మరి అది ఎంత వరకు నిజం అవుతుందో చూడాలి.