Cooku With Jathiratnalu Title winner: ఈమధ్య కాలంలో మన ఆడియన్స్ బుల్లితెర మీద ప్రసారమయ్యే ఎంటర్టైన్మెంట్ షోస్ ని ఎంతలా ఆదరిస్తున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వీకెండ్ వచ్చిందంటే చాలు, ఆడియన్స్ ఈ ఎంటర్టైన్మెంట్ షోస్ లేటెస్ట్ ఎపిసోడ్స్ కోసం పనులు మొత్తం మానుకొని మరీ టీవీల ముందు కూర్చుంటున్నారు. ఈటీవీ ఛానల్ నుండి ఈ సంస్కృతి మొదలైంది. ఆ తర్వాత స్టార్ మా ఛానల్, జీ తెలుగు ఇలా అన్ని చానెల్స్ లోనూ ఎంటర్టైన్మెంట్ షోస్ కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. రీసెంట్ గా స్టార్ మా ఛానల్ లో మొదలైన ‘కూకూ విత్ జాతి రత్నాలు'(Cooku With Jathiratnalu) ప్రోగ్రాం కి సంబంధించి, అన్ని ఎపిసోడ్స్ షూటింగ్స్ పూర్తి అయ్యాయి. ప్రతీ శని, ఆదివారాల్లో ప్రసారమయ్యే ఈ ఎంటర్టైన్మెంట్ షో కి ఆడియన్స్ నుండి అద్భుతమైన ప్రజాధారణ లభించింది. వంట ప్రోగ్రాం లో అదిరిపోయే రేంజ్ ఎంటర్టైన్మెంట్ కూడా జోడించడం తో ఈ రేంజ్ హిట్ అయ్యింది.
Read Also: ఒక్క ప్రాంతం నుండి గంటకు 50 వేల టిక్కెట్లు..’కూలీ’ సునామీ మొదలైంది!
అయితే ఈ సీజన్ విజేత గా సుజిత నిలిచిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ ని నిన్ననే పూర్తి చేశారు. మొదటి ఎపిసోడ్ నుండి సుజిత, యష్మీ, బాబా భాస్కర్, తనూజ మరియు ప్రభాకర్ వంటి వారు అద్భుతమైన వంటకాలతో టాప్ మార్కులతో కొనసాగుతూ వచ్చేవారు. కచ్చితంగా వీరిలోనే విజేత ఉంటారని అంతా అనుకున్నారు. అందరి అంచనాలకు తగ్గట్టుగానే సుజిత్ ఈ సీజన్ విన్నర్ గా నిలిచింది. ఇక రన్నర్ గా ఎవరు నిలిచారు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. గత ఎపిసోడ్ మినహా, మిగిలిన అన్ని ఎపిసోడ్స్ లోనే యష్మీ మొదటి రెండు స్థానాల్లోనే కొనసాగుతూ వచ్చింది. కాబట్టి కచ్చితంగా ఆమెనే రన్నర్ అయ్యి ఉండొచ్చని కొందరు అంటున్నారు. ఆమె తర్వాత బాబా భాస్కర్ మాస్టర్ కూడా ఇదే రేంజ్ ఫార్మ్ ని మైంటైన్ చేస్తూ వస్తున్నాడు, కాబట్టి ఈయన కూడా రన్నర్ అయ్యే అవకాశాలు ఎక్కువ.
Read Also: ది ప్యారడైజ్’ నుండి నాని ఫస్ట్ లుక్ వచ్చేసింది..ఈ ‘జడల్’ ఏంటయ్యా బాబు!
స్టార్ మా ఛానల్ లో ‘కిరాక్ బాయ్స్..కిలాడీ గర్ల్స్’ అనే ప్రోగ్రాం అయిపోయిన వెంటనే ఈ షో మొదలైంది. ఇప్పుడు ఈ షో పూర్తి అవ్వగానే ‘బిగ్ బాస్ 9’ మొదలు కానుంది. ఈ షో లో ఒక కంటెస్టెంట్ గా ‘కూకూ విత్ జాతిరత్నాలు’ విన్నర్ సుజిత పాల్గొనబోతుందని టాక్. అదే విధంగా ఈ షోలో పాల్గొన్న ఇమ్మానుయేల్, రీతూ చౌదరి వంటి వారు కూడా బిగ్ బాస్ 9 లోకి కంటెస్టెంట్స్ గా అడుగుపెట్టబోతున్నారని టాక్. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రానున్నాయి. ఇదంతా పక్కన పెడితే ఈ సీజన్ లో సామాన్యులకు, సెలబ్రిటీలకు మధ్య భీకర పోరాటం జరగబోతున్న సంగతి తెలిసిందే. చూస్తుంటే ఈ సీజన్ పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేలాగా అనిపిస్తుంది.