Coolie Censor: సూపర్ స్టార్ రజనీకాంత్(Superstar Rajinikanth) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘కూలీ'(Coolie Movie) నేడు సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఇదేదో మాస్ కమర్షియల్ సినిమా, కుర్రాళ్లతో పాటు పెద్దవాళ్ళు కూడా చూసేవిధంగా ఉంటుంది కాబట్టి, కచ్చితంగా ఈ చిత్రానికి UA సర్టిఫికేట్ ఇస్తారని అంతా అనుకున్నారు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి A సర్టిఫికేట్ ని జారీ చేశారు. ఇదే ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం. అంటే సినిమాలో అంత హింస ఉందా?, రజనీకాంత్ ని డైరెక్టర్ అంత వయొలెంట్ గా చూపించాడా అని సోషల్ మీడియా లో ప్రతీ ఒక్కరు మాట్లాడుకుంటారు. రేపు ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేయబోతున్నారు. అప్పుడు అర్థం అవుతుంది ఈ చిత్రానికి ఎందుకు A సర్టిఫికేట్ ని ఇచ్చారు అనేది.
Also Read: బాలకృష్ణ సినిమాకు నేషనల్ అవార్డు..నందమూరి ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే సమయం!
ఇక సెన్సార్ సభ్యుల నుండి ఈ చిత్రానికి ఎలాంటి టాక్ వచ్చిందో చూద్దాం. ఫస్ట్ హాఫ్ వరకు డైరెక్టర్ లోకేష్ కనకరాజ్(Lokesh Kanagaraj) రజనీకాంత్ ఎనర్జీ, స్టైల్, స్వాగ్ ఇలా ప్రతీ ఒక్క దానిని పర్ఫెక్ట్ గా వాడుకుంటూ అద్భుతంగా వెండితెరపై చూపించాడట. ఎలివేషన్ సన్నివేశాలు కూడా వేరే లెవెల్ లో తీసినట్టు సమాచారం. ఇక ఇంటర్వెల్ లో రజనీకాంత్, నాగార్జున కి మధ్య వచ్చే ఒక ఫైట్ సన్నివేశానికి థియేటర్స్ బ్లాస్ట్ అయిపోతాయని అంటున్నారు. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే , డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ ఎక్కువ శాతం ఈసారి ఎమోషన్స్ మీదనే ద్రుష్టి పెట్టాడట. ఇలాంటి సినిమాల్లో ప్రారంభం నుండి ఎండింగ్ వరకు ఒకే మోడ్ లో ఉండాలి కానీ,మధ్యలో ఎమోషన్ సన్నివేశాలు పెడితే సినిమా ఫ్లో దెబ్బతింటుంది అనేది విశ్లేషకుల అభిప్రాయం. అందుకు రీసెంట్ ఉదాహరణ ‘హరి హర వీరమల్లు’. పవన్ కళ్యాణ్ నటించిన ఈ చిత్రం ఫస్ట్ హాఫ్ ఒక కథ లాగా ఉంటే, సెకండ్ హాఫ్ మాత్రం మరో కథలాగా ఉంటుంది.
అందుకే ఆడియన్స్ ఆ సినిమాకు కనెక్ట్ కాలేకపోయారు. కూలీ సెకండ్ హాఫ్ గురించి కూడా ఇలాంటి టాక్ వినిపిస్తోందని కోలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం. సెకండ్ హాఫ్ చాలా అంటే చాలా వీక్ అనేది వాళ్ళ నుండి వినిపిస్తున్న మాట. మరి అది ఎంత వరకు నిజం అవుతుందో చూడాలి. లోకేష్ కనకరాజ్ గత చిత్రం ‘లియో’ విషయం లో కూడా ఇదే జరిగింది. ఫస్ట్ హాఫ్ అద్భుతంగా ఉంటుంది, ఇంటర్వెల్ లో హీరో కి ఇచ్చే ఎలివేషన్స్ వేరే లెవెల్. కానీ సెకండ్ హాఫ్ కి మాత్రం అప్పట్లో బ్యాడ్ రిపోర్ట్స్ వచ్చాయి. కూలీ చిత్రానికి కూడా అదే ప్రమాదం పొంచి ఉందని అంటున్నారు.
#Coolie censored ️ #Coolie releasing worldwide August 14th @rajinikanth @Dir_Lokesh @anirudhofficial #AamirKhan @iamnagarjuna @nimmaupendra #SathyaRaj #SoubinShahir @shrutihaasan @hegdepooja @anbariv @girishganges @philoedit @ArtSathees @iamSandy_Off @Dir_Chandhru… pic.twitter.com/p2z6GEOb6K
— Sun Pictures (@sunpictures) August 1, 2025