71st National Film Awards 2025: నందమూరి అభిమానులకు ఈ ఏడాది బాలయ్య(Nandamuri Balakrishna) ఇచ్చినంత కిక్ ఏ హీరో కూడా ఇవ్వలేదు. ఏడాది ప్రారంభం లో ‘డాకు మహారాజ్’ చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్న బాలయ్య, ఇదే ఏడాదిలో పద్మభూషణ్ అవార్డుని కూడా అందుకున్నాడు. ఇప్పుడు నందమూరి ఫ్యాన్స్ మొత్తం ‘అఖండ 2′(Akhanda 2 ) కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న సమయం లో, మరో క్రేజీ న్యూస్ నందమూరి అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన ‘భగవంత్ కేసరి'(Bhagavanth Kesari) చిత్రం 2023 వ సంవత్సరం లో దసరా కానుకగా విడుదలై అద్భుతమైన కమర్షియల్ హిట్ గా నిల్చింది. బాలయ్య లోని సరికొత్త కోణాన్ని ఆవిష్కరించిన ఈ చిత్రం 70 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఆయన జైత్ర యాత్రకి కొనసాగింపుగా ఈ చిత్రం నిల్చింది.
Also Read: తెలుగులో ఉన్న స్టార్ డైరెక్టర్స్ కి అడ్వాన్సులు ఇచ్చిన కొత్త ప్రొడక్షన్ హౌస్…
అలాంటి సినిమాకి కేంద్ర ప్రభుత్వం ఉత్తమ తెలుగు చిత్రం గా నేషనల్ అవార్డు(National Award) కి ఎంపిక చేసింది. సినిమాలో వినోదం తో పాటు, మంచి సందేశం కూడా ఉండడం వల్లే ఈ చిత్రాన్ని నేషనల్ అవార్డుకు ఎంపిక చేసినట్టు సమాచారం. ఇదే చిత్రాన్ని ఇప్పుడు తమిళం లో కూడా హీరో విజయ్ రీమేక్ చేస్తున్నాడు. అయితే ఈ చిత్రానికి నేషనల్ అవార్డు రావడం పై నందమూరి అభిమానులు మరియు సినీ అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తుంటే, కొన్ని వర్గాలు మాత్రం విమర్శలు చేస్తున్నాయి. బాలకృష్ణ కూటమికి చెందిన వాడు కాబట్టే పద్మభూషణ్ అవార్డు, ఆ వెంటనే ఆయన సినిమాకు నేషనల్ అవార్డు వచ్చిందని, లేకపోతే ‘భగవంత్ కేసరి’ ని మించిన సినిమాలు చాలానే ఉన్నాయని అంటున్నారు. ఇక మిగిలిన క్యాటగిరీల్లో నేషనల్ అవార్డుని పొందిన లిస్ట్ ని ఒకసారి పరిశీలిద్దాం.
నేషనల్ అవార్డ్స్:
ఉత్తమ సంగీత దర్శకుడు : జీవి ప్రకాష్ కుమార్ (వాతి)
ఉత్తమ సంగీతం : హర్ష వర్ధన్ రామేశ్వర్ (యానిమల్)
ఉత్తమ నటుడు : షారుఖ్ ఖాన్ (జవాన్), విక్రాంత్ మిస్సే (12th ఫెయిల్)
ఉత్తమ నటి : రాణి ముఖర్జీ (మిస్సెస్ ఛటర్జీ వెర్సస్ నార్వే)
ఉత్తమ దర్శకుడు : సుదీప్తో సేన్ (ది కేరళ స్టోరీ)
ఉత్తమ యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ మూవీ : హనుమాన్ (తెలుగు)
ఉత్తమ ఫీచర్ ఫిలిం : 12th ఫెయిల్