71st National Film Awards 2025: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లలో సుకుమార్ ఒకరు. స్టార్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకు సుకుమార్ ఆయన చేసే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం రామ్ చరణ్ తో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నా ఆయన ఈ సినిమాతో ఇండస్ట్రీలో ఉన్న పలు రికార్డులను బ్రేక్ చేయడం లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది… పుష్ప 2 సినిమాతో బాహుబలి 2 రికార్డు లను బ్రేక్ చేసిన సుకుమార్ ఇప్పుడు దానికి మించిన సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నది…ఆర్య సినిమాతో తన ప్రస్థానన్ని మొదలుపెట్టిన సుకుమార్ అప్పటినుంచి ఇప్పటివరకు వైవిద్య భరితమైన కథాంశాలతో సినిమాలను చేయడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నాడు. ఆయన చేసిన ప్రతి సినిమా ఏదో ఒక వైవిధ్యమైన కథాంశాన్ని ఎలివేట్ చేస్తూ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో ఉన్న ప్రేక్షకులందరిని మెప్పిస్తూన్నాయి. ఇక ఆయన ఎంటైర్ కెరియర్ లో చేసినవి తక్కువ సినిమాలే అయినప్పటికీ తనకు దక్కని ఒక అరుదైన గౌరవాన్ని తన కూతురు అయిన సుకృత వేణి దక్కించుకుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… ‘ గాంధీ తాత చెట్టు’ సినిమాతో నటిగా మారిన సుకృత ఈ సినిమాలో తన నట విశ్వరూపాన్ని చూపించింది.
Also Read: బాలకృష్ణ సినిమాకు నేషనల్ అవార్డు..నందమూరి ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే సమయం!
ఇక దానికి గాను 71 వ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించిన కేంద్రం ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్ గా సుకృత వేణి పేరును ప్రకటించడం సుకుమార్ తో పాటు అతని అభిమానులను కూడా ఆనందానికి గురిచేస్తుంది… టాప్ డైరెక్టర్ అయిన సుకుమార్ కి ఇప్పటివరకు ఒక్క నేషనల్ అవార్డ్ కూడా రాలేదు. కానీ మొదటి సినిమాతోనే తన కూతురు నేషనల్ అవార్డు గెలిచుకోవడం పట్ల ఆయన కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది…
నటిగా తనకు మంచి లైఫ్ ఉందని చాలామంది విమర్శకులు సైతం ప్రశంసిస్తున్నారు. గాంధీతాత చెట్టు సినిమాతో ఒక మోరల్ మెసేజ్ ను సమాజానికి అందించిన ఆమె చాలా చక్కటి నటనను కనబరిచింది. ఇక మీదట కూడా నటిగా కొనసాగితే మంచి అవకాశాలు వస్తాయి అంటూ కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తూ ఉండడం విశేషం…
ఆ సినిమా కోసం సుకృత వేణి పడిన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కింది అంటూ ఇంకొంతమంది సినిమా క్రిటిక్స్ సైతం ఆమెకు సపోర్టుగా మాట్లాడుతున్నారు. మరి ఏది ఏమైనా కూడా తన ఎంటైర్ కెరియర్ లో ఒక్కసారైనా నేషనల్ అవార్డ్ ను అందుకోవాలనే కుతూహలం లో ఉంటారు. కానీ చాలా తక్కువ సమయంలోనే సుకృత వేణి కి ఆ అవార్డు రావడం నిజంగా చాలా గర్వించదగ్గ విషయం అనే చెప్పాలి…