Brahmaji- Anchor Suma: అందరూ మర్చిపోయిన ‘ఆంటీ’ వివాదాన్ని మరలా తట్టిలేపాడు సీనియర్ నటుడు బ్రహ్మాజీ. కృష్ణ వ్రింద విహారి ప్రీరిలీజ్ వేడుక సాక్షిగా ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. యాంకర్ సుమ, బ్రహ్మాజీ మధ్య సంభాషణ ఒకింత వివాదాస్పదంగా ఉంది. ఈ మధ్య ఆంటీకి పర్యాయపదంగా అనసూయ మారిన తరుణంలో బ్రహ్మాజీ మరలా ఆ పదాన్ని వాడారు. లైగర్ విడుదల సమయంలో అనసూయకు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కి మధ్య సోషల్ మీడియా వార్ నడిచిన విషయం తెలిసిందే. అర్జున్ రెడ్డి మూవీ నాటి వివాదాన్ని గుర్తు చేస్తూ అనసూయ ట్వీట్ వేశారు. అమ్మను తిట్టిన కర్మ ఫలమే ఇది అంటూ కామెంట్ చేసింది.

అప్పట్లో అనసూయ అర్జున్ రెడ్డి సినిమాలో హీరో విజయ్ దేవరకొండ ‘మాదర్ చూ**’ అనే బూతును వాడడాన్ని తప్పుబట్టారు. దీనిపై ఆమె నిరసన చేపట్టారు. అప్పుడు అమ్మను తిట్టిన పాపం విజయ్ దేవరకొండను వెంటాడింది, అందుకే లైగర్ ప్లాప్ అయ్యిందని అర్థం వచ్చేలా అనసూయ ట్వీట్ ఉంది. అసలే డిజాస్టర్ టాక్ తో బాధలో ఉన్న విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కి అనసూయ ట్వీట్ మరింత మండేలా చేసింది. దీంతో ఆంటీ అంటూ ఆమెపై ట్రోల్స్ కి తెగబడ్డారు. ఆంటీ అనడం కూడా నేరమేనన్న అనసూయ సైబర్ క్రైమ్ విభాగంలో కంప్లైంట్ ఇచ్చింది.
Also Read: Allu Arjun Daughter Arha: కూతురు విసిరిన ఛాలెంజ్‌లో ఓడిన అల్లు అర్జున్.. వీడియో వైరల్..
ఇక ఆంటీ హ్యాష్ ట్యాగ్ దాదాపు మూడు రోజు ట్విట్టర్ లో ట్రెండ్ అయ్యింది. ఆంటీ అని ఎవరు ఎవరినన్నా.. అనసూయనే అన్నట్లన్న పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో ఆంటీ పదానికి అనసూయ కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యారు. కాగా నిన్న నాగ శౌర్య లేటెస్ట్ మూవీ కృష్ణ వ్రింద విహారి ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. ఈ ఈవెంట్ కి నటుడు బ్రహ్మాజీ హాజరయ్యారు. ఆయన వద్దకు వచ్చిన యాంకర్ సుమ.. మీ మనోభావాలు ఏమైనా దెబ్బతిన్నాయా? అంటూ ప్రశ్నించింది? ఎందుకు అని బ్రహ్మాజీ అన్నారు. అంటే మిమ్మల్ని లేటుగా పీల్చాను కదా, అందుకు ఏమైనా బాధపడ్డారేమో అని అడిగాను అన్నారు.

అనంతరం బహ్మాజీ యాంకర్ సుమను… మీరు నన్నేమీ అడగరా? అన్నారు. అయితే మీ ఆస్తుల విలువ చెప్పండి? అని సుమ అన్నారు. అది రాజీవ్ కనకాలకు తెలుసని సమాధానం చెప్పాడు. రెండో ప్రశ్నగా… అయితే మీ ఏజ్ ఎంతో చెప్పండి అన్నారు. దానికి బ్రహ్మాజీ నాటీ… ఆంటీ… అంటూ వ్యంగ్యంగా దీర్ఘం తీశాడు. దానికి సుమ వామ్మో ఇది ఎటు నుంచి ఎటు పోతుందో… ఇక దీనిపై నో కామెంట్ అని బ్రహ్మాజీని మాట్లాడకుండా చేశారు. ఇక్కడ బ్రహ్మాజీ టార్గెట్ చేసింది అనసూయనే అని తెలుస్తుంది. గతంలో కూడా ఆయన ఆంటీ వివాదం నడుస్తుండగా… ట్విటర్ లో ”అంకుల్ ఏంట్రా అంకుల్… అలా అంటే కేసు పెడతా” అని కామెంట్ పోస్ట్ చేశాడు. ఇలా సందర్భం దొరికినప్పుడల్లా అనసూయను బ్రహ్మాజీ టార్గెట్ చేయడం విశేషంగా మారింది.
Also Read: Raasi: హీరోయిన్ రాశి కి ఎన్ని పెళ్లిళ్లు అయ్యాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు