https://oktelugu.com/

Venu Swamy- Akhil Akkineni: అఖిల్ సినిమాల విషయంలో ఆమె ఏలు పెట్టకూడదు… అతని జాతకం ఇదే, వేణు స్వామి సంచలనం!

అడిగినా అడగక పోయినా ట్రెండీ టాపిక్, పీపుల్ మీద ఆయన స్పందిస్తారు. ఏజెంట్ పరాజయంతో అక్కినేని హీరో అఖిల్ పరిస్థితి దారుణంగా మారింది. అఖిల్ ఫెయిల్యూర్ గురించి టాలీవుడ్ లో హాట్ టాపిక్ నడుస్తుంది.

Written By:
  • Shiva
  • , Updated On : May 1, 2023 / 05:16 PM IST
    Follow us on

    Venu Swamy- Akhil Akkineni: సెలబ్రిటీల జాతకులు చెబుతూ ఫేమస్ అయ్యాడు వేణు స్వామి. ఈయనకు భారీ ఫాలోయింగ్. టాప్ స్టార్స్ కేరీర్ కోసం పూజలు చేయించుకుంటారు. రష్మిక మందాన ఆయన రెగ్యులర్ కస్టమర్. ఇప్పటికే పలుమార్లు ఆయన చేత పూజలు చేయించుకుంది. ఆమె అనుభవిస్తున్న స్టార్డం, సక్సెస్ వేణు స్వామి పూజల మహిమేనట. ఈ విషయాన్ని ఆమె గట్టిగా నమ్ముతున్నారు. ఇటీవల నిధి అగర్వాల్ కూడా ఆయన భక్తురాలిగా మారారు. ఆమె కూడా ప్రత్యేక పూజలు జరిపించారు అంతెందుకు హీరో బాలకృష్ణ సైతం ఆయన కస్టమర్స్ లిస్ట్ లో ఉన్నాడట. ఆయనకు వేణు స్వామి కొన్ని పూజలు చేశారట.

    అడిగినా అడగక పోయినా ట్రెండీ టాపిక్, పీపుల్ మీద ఆయన స్పందిస్తారు. ఏజెంట్ పరాజయంతో అక్కినేని హీరో అఖిల్ పరిస్థితి దారుణంగా మారింది. అఖిల్ ఫెయిల్యూర్ గురించి టాలీవుడ్ లో హాట్ టాపిక్ నడుస్తుంది. ఈ క్రమంలో వేణు స్వామి స్పందించారు. అఖిల్ జాతకాన్ని బట్టి ప్లాప్స్ ఎందుకు పడుతున్నాయో? హిట్ కొట్టాలంటే ఏం చేయాలో వెల్లడించారు. అఖిల్ జాతకంలో నాగదోషం ఉందట. ఈ దోషం ఉన్నవారు ఇతరుల సలహాలు తీసుకోవడం మంచిది కాదట.

    కాబట్టి దర్శకులు, కథలు ఎంపికలో ఎవరి సలహాలు తీసుకోకుండా ముందుకు సాగలట. ముఖ్యంగా అమ్మ అమల ప్రమేయం లేకుండా చూసుకోవాలట. అఖిల్ కి చంద్రుడు నీచంలో ఉన్నాడట. చంద్రుడు అంటే అమ్మ, సూర్యుడు అంటే నాన్న అట. చంద్రుడు నీచంలో ఉన్నాడు కాబట్టి… అమల అఖిల్ కెరీర్ విషయంలో సైలెంట్ గా ఉండాలట. ఆమె ఏ మాత్రం ఇన్వాల్వ్ అయినా అఖిల్ కి పరాజయాలు తప్పవట. వేణు స్వామి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

    అఖిల్ చైల్డ్ ఆర్టిస్ట్ గా సిసింద్రీ మూవీ చేశాడు. అది పసిప్రాయంలో చేసిన సినిమా. 2015లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. దర్శకుడు వివి వినాయక్ తో నాగార్జున భారీగా లాంచ్ చేశాడు. ఫలితం దెబ్బేసింది. అఖిల్ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అనంతరం హలో, మిస్టర్ మజ్ను చిత్రాలు చేశారు అవి కూడా నిరాశపరిచాయి. నాలుగు చిత్రంతో అఖిల్ కి హిట్ పడింది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ విజయం సాధించింది. హమ్మయ్య అని ఊపిరి తీసుకుని లోపు ఏజెంట్ మూవీతో భారీ దెబ్బ తగిలింది.