Anasuya Bharadwaj Mass Look: అనసూయ లేటెస్ట్ మూవీ విమానం. మే డే పురస్కరించుకుని ఫస్ట్ లుక్ విడుదల చేశారు. కాళ్లకు పట్టీలు, చేతులకు గాజులు, చీరకట్టి మాస్ అవతార్ లో అనసూయ దర్శనమిచ్చింది. అనసూయ ఊర మాస్ గెటప్ సినిమాపై అంచనాలు పెంచేసింది. అనసూయ లుక్ ఆమె గతంలో చేసిన రంగమ్మత్త పాత్రను తలపించింది. ఇండస్ట్రీ హిట్ రంగస్థలం మూవీ అనసూయ చేసిన పల్లెటూరి ఆంటీ పాత్ర ఆమెకు మంచి పేరు తెచ్చింది. నటిగా బ్రేక్ ఇచ్చింది. రంగస్థలం చిత్రం తర్వాత అనసూయ నటిగా బిజీ అయ్యారు. మరోసారి అనసూయ రంగమ్మత్త తరహా పాత్రలో అలరించనున్నారు.
విమానం చిత్రానికి శివ ప్రసాద్ .వై దర్శకుడు. సముద్ర ఖని మరో ప్రధాన పాత్ర చేశారు. గాల్లో ఎగిరే విమానం చుట్టూ అల్లుకున్న ఎమోషనల్ డ్రామాగా విమానం మూవీ తెరకెక్కింది. విచిత్రం ఏమిటంటే ఈ చిత్ర దర్శకుడు శివ ప్రసాద్ కూడా గతంలో విమానం ఎక్కలేదట. విమానం నిర్మాతలు డబ్బింగ్ పని మీద శివ ప్రసాద్ ని హైదరాబాద్ నుండి చెన్నై పంపారట. అప్పుడు మొదటిసారి విమానం ఎక్కాడట. జూన్ 9న విమానం మూవీ విడుదల కానుంది. సాయి కొర్రపాటి నిర్మాతగా ఉన్నారు. ఈ ప్రయోగాత్మక చిత్రం ఏ మేరకు ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి.
ఇక అనసూయ కెరీర్ మూడు పూలు ఆరు కాయలు అన్నట్లుగా ఉంది. ఆమె వరుస ప్రాజెక్ట్స్ ప్రకటిస్తున్నారు. అనసూయ చేతిలో ఉన్న భారీ ప్రాజెక్ట్ పుష్ప 2. ఈ చిత్రంలో ఆమె నెగిటివ్ రోల్ చేస్తున్న విషయం తెలిసిందే. పార్ట్ 1 లో మెయిన్ విలన్ గా ఉన్న సునీల్ భార్యగా దాక్షాయణి పాత్రలో మెప్పించారు. మరి పార్ట్ 2లో అనసూయ పాత్రను దర్శకుడు సుకుమార్ ఎలా తీర్చిద్దాడో చూడాలి. పుష్ప 2 దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతుంది. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా విడుదల కానుందని సమాచారం.
కాగా అనసూయను బుల్లితెర ప్రేక్షకులు బాగా మిస్ అవుతున్నారు. ఆమె యాంకరింగ్ మానేసి దాదాపు ఏడాది అవుతుంది. తనకు కెరీర్ ఇచ్చిన జబర్దస్త్ నుండి అనసూయ వైదొలిగారు. బయటికి వస్తూ కొన్ని ఆరోపణలు కూడా చేశారు. జబర్దస్త్ కమెడియన్స్ తనపై బాడీ షేమింగ్ కి పాల్పడ్డారని అనసూయ అసహనం వ్యక్తం చేశారు. ఇటీవల ఆన్లైన్ ఛాట్ లో ఒక అభిమాని తిరిగి బుల్లితెరకు ఎప్పుడొస్తున్నారని అడగ్గా… రానని పరోక్షంగా చెప్పేశారు. మేకర్స్ టీఆర్పీ కోసం చేసే చెత్త స్టంట్స్ పోవాలి, అప్పుడే నేను మళ్ళీ యాంకర్ గా మారతాను అన్నారు. అది జరిగేది లేదు కాబట్టి… అనసూయ యాంకరింగ్ చేయడం కల్ల.
She is one of the strongest lady we find in real and her reel character too ❤️
The dazzling @anusuyakhasba garu is ready to swoon you in #VIMANAM ✈️
– https://t.co/5xJQI62dvq#HappyMayDay
Landing in your nearest theatres on June 9th@thondankani #Meerajasmine @eyrahul… pic.twitter.com/ldK7YKsCf3
— Prasad Nimmakayala (@lemonsprasad) May 1, 2023