Telugu News » Ap » Elephant poaching in chittoor district man killed
చిత్తూర్ జిల్లాలో ఏనుగుల బీభత్సం.. వ్యక్తి మృతి
ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూర్ జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. చిత్తూర్ రూరల్ మండలంలో ఉదయం నుంచి నలుగురిపై దాడి చేశాయి. తీవ్రంగా గాయపడటంతో బాధితులను చికిత్స నిమిత్తం రుయా దవాఖానకు తరలించారు. గాయపడిన వారిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి వజ్రవేలు అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని జీడీ నెల్లూరు మండలం వేల్పూరు ఇందిరానగర్ వాసిగా పోలీసులు గుర్తించారు. జిల్లాలోని శీరంగరాజపురం, గంగాధర నెల్లూరు మండలాల పరిధిలోని అటవీ ప్రాంతం నుంచి ఏనుగులు బయటకు వచ్చి […]
ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూర్ జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. చిత్తూర్ రూరల్ మండలంలో ఉదయం నుంచి నలుగురిపై దాడి చేశాయి. తీవ్రంగా గాయపడటంతో బాధితులను చికిత్స నిమిత్తం రుయా దవాఖానకు తరలించారు. గాయపడిన వారిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి వజ్రవేలు అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని జీడీ నెల్లూరు మండలం వేల్పూరు ఇందిరానగర్ వాసిగా పోలీసులు గుర్తించారు. జిల్లాలోని శీరంగరాజపురం, గంగాధర నెల్లూరు మండలాల పరిధిలోని అటవీ ప్రాంతం నుంచి ఏనుగులు బయటకు వచ్చి సమీప గ్రామాల్లో సంచరిస్తున్నాయి.