https://oktelugu.com/

ఆ హీరోయిన్ కు చేదు అనుభవం

ఇప్పుడు ఇంట్లో చేసుకోవడానికి ఎవరికీ టైం ఉండడం లేదు. ఇక చేసుకునే ఓపిక లేదు. అందరూ ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నాడు. గంటలో మన ముందు అవి ఉంటున్నాయి. ఇంకేముంది ఇదేదో మంచి వ్యాపారంగా మారిపోయింది. జోమాటో, స్విగ్గీ లాంటి ఫుడ్ డెలవరీ సంస్థలు వివిధ హోటళ్లతో టై అప్ అయ్యి ఈ ఫుడ్ డెలివరీ చేస్తున్నాయి. తాజాగా దక్షిణాది హీరోయిన్.. తెలుగులో ‘అల వైకుంఠపురంలో’ నటించిన నివేదా పేతురాజ్ కూడా ఇలానే ఫుడ్ […]

Written By:
  • NARESH
  • , Updated On : June 24, 2021 / 02:32 PM IST
    Follow us on

    ఇప్పుడు ఇంట్లో చేసుకోవడానికి ఎవరికీ టైం ఉండడం లేదు. ఇక చేసుకునే ఓపిక లేదు. అందరూ ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నాడు. గంటలో మన ముందు అవి ఉంటున్నాయి. ఇంకేముంది ఇదేదో మంచి వ్యాపారంగా మారిపోయింది.

    జోమాటో, స్విగ్గీ లాంటి ఫుడ్ డెలవరీ సంస్థలు వివిధ హోటళ్లతో టై అప్ అయ్యి ఈ ఫుడ్ డెలివరీ చేస్తున్నాయి. తాజాగా దక్షిణాది హీరోయిన్.. తెలుగులో ‘అల వైకుంఠపురంలో’ నటించిన నివేదా పేతురాజ్ కూడా ఇలానే ఫుడ్ ఆర్డర్ చేసింది.

    ప్రస్తుతం నివేదా తమిళ, తెలుగు సినిమాలతో బీజీగా ఉంది. చెన్నైలో ఉంటోంది. ప్రస్తుతం ‘విరాటపర్వం’, పాగల్ చిత్రాల్లో ఆమె నటిస్తోంది. చెన్నైలోని పేరుపొందిన ఓ ప్రముఖ రెస్టారెంట్ నుంచి బుధవారం సాయంత్రం నివేదా పేతురాజ్ ఫ్రైడ్ రైస్ ను ఆర్డర్ చేసింది. ఫుడ్ డెలివరీ కూడా అయ్యింది. అనంతరం ప్యాక్ ఓపెన్ చేయగానే అందులో ఆమెకు బొద్దింక కనిపించింది.

    దీంతో రెస్టారెంట్ ను ట్యాగ్ చేస్తూ నివేదాపేతురాజ్ అసహనంతో పోస్ట్ చేశారు. ‘హోటళ్లు పరిశుభ్రత పాటించడం లేదని.. నేను ఆర్డర్ చేసిన భోజనంలో బొద్దింక వచ్చిందని.. ఈ హోటళ్లు నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదు. కొనుగోలు దారుల ఆరోగ్యంతో ఆడుకుంటున్నాయని.. వీటిపై భారీ జరిమానా వేయాలని’ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

    నివేదా పేతురాజ్ ‘ఓరు నాల్ కొథు’ అనే తమిళ సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చింది. ఈ ముద్దుగుమ్మది కేరళ. మలయాళి కుట్టి ‘మెంటల్ మదిలో’ చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది.