
ఏపీ సీఎం జగన్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు మరో లేఖ రాశారు. సుప్రీంకోర్టు హితవుపలికిన నేపథ్యంలో బోర్డు పరీక్షల రద్దుపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని, పరీక్షలు రద్దు చేయాలని ఆ లేఖలో పేర్కొన్నారు. పట్టుదల, పంతాలు, పట్టింపులు పక్కన పెట్టి విద్యార్థుల ప్రాణాలు కాపాడాలని కోరారు. పరీక్షల నిర్వహణలో ప్రభుత్వ చిత్తశుద్ధిని సుప్రీంకోర్టు శంకించిందని, ఆ విషయాన్ని గుర్తెరగాలన్నారు. ప్రభుత్వ తీరుపై సర్వోన్నత న్యాయస్థానం అనేక అనుమానాలు లేవనెత్తిందన్నారు. కరోనా అనిశ్చితి వాతావరణం కొనసాగుతున్న తరుణంలో పరీక్షల నిర్వహణకే ప్రభుత్వం మొగ్గు చూపటం బాధాకరమైన విషయమన్నారు.