Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం పై నేడు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ లో మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో సెన్సేషనల్ టాపిక్ అయ్యింది. ఆరోజు జరిగిన ఘటన గురించి ఆయన వివరించిన తీరు, సినీ పరిశ్రమ మొత్తం అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన వ్యవహారం పై సీఎం రేవంత్ రెడ్డి చాలా ఫైర్ అయ్యాడు. ఆయన మాట్లాడుతూ ‘అల్లు అర్జున్ ఒక్క రోజు జైలుకి వెళ్ళాడు. అతను థియేటర్ కి రావడం వల్ల అతనికి ఎలాంటి నష్టం జరగలేదు. అతని కాళ్ళు, చేతులకు ఏమైనా దెబ్బలు తగిలాయా?, అతని చిన్న ఘాటు అయినా పడిందా?, కానీ అక్కడ ఒక తల్లి చనిపోయింది. ఆ తల్లి బిడ్డ చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు. అయినా సినీ పరిశ్రమ ఆ అబ్బాయి గురించి ఒక్క మాట మాట్లాడలేదు, అల్లు అర్జున్ ని జైలు లో ఒక్క రోజు పెట్టినందుకు అతనికి ఎదో జరిగిపోయినట్టు వచ్చారు’ అంటూ మండిపడ్డాడు సీఎం రేవంత్ రెడ్డి.
సినీ ఇండస్ట్రీ ప్రవర్తించిన ఈ తీరుపై రేవంత్ రెడ్డి తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఇక మీదట నేను సీఎం గా ఉన్నన్ని రోజులు సినిమాలకు స్పెషల్ బెనిఫిట్ షోస్ కానీ, అదనపు టికెట్ రేట్స్ ఇవ్వడం కానీ జరగదు అంటూ సంచలన ప్రకటన చేసాడు. ఆయన చేసిన ఈ ప్రకటనకు టాలీవుడ్ మొత్తం ఉలిక్కిపడింది. అల్లు అర్జున్ ప్రోటోకాల్స్ అసలు అనుసరించలేదు, అతను శిక్షార్హుడు అంటూ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టంగా అసెంబ్లీ సాక్షిగా చెప్పుకొచ్చాడు. దీనికి అల్లు అర్జున్ వైపు నుండి రెస్పాన్స్ వస్తుందా లేదా అనేది చూడాలి. మరోవైపు హైదరాబాద్ పోలీసులు అల్లు అర్జున్ కి బెయిల్ రద్దు చెయ్యాలంటూ సుప్రీమ్ కోర్టు ని అతి త్వరలోనే ఆశ్రయించబోతున్నారు.
మరోపక్క శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడిప్పుడే చిన్నగా మెరుగుపడుతుందని డాక్టర్లు ఒక బులిటెన్ ని విడుదల చేసారు. చికిత్స కి స్పందిస్తున్నాడని, రెండు మూడు సార్లు కళ్ళు కూడా తెరిచాడని, కానీ అతను ఎవరినీ గుర్తుపట్టలేకపోతున్నాడంటూ చెప్పుకొచ్చారు డాక్టర్లు. రెండు రోజుల క్రితమే అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ శ్రీ తేజ్ ని కలిసి, అతని ఆరోగ్య పరిస్థితి పై ఆరా తీసిన సంగతి మన అందరికీ తెలిసిందే. అల్లు అర్జున్ కూడా త్వరలోనే ఆ పిల్లాడిని కలవబోతున్నట్టు సమాచారం. మరోపక్క అల్లు అర్జున్ ఆ అబ్బాయి ఆరోగ్యం మెరుగుపడేందుకు కావాల్సిన ఆర్ధిక సహాయం, వైద్యం అందిస్తున్నాడు. ప్రభుత్వం కూడా ఆ అబ్బాయి పట్ల ప్రత్యేక శ్రద్ద తీసుకొని వైద్యం అందిస్తున్నారు. అయితే అల్లు అర్జున్ కి ఇచ్చిన బెయిల్ గడువు జనవరి 12 వ తారీఖు తో ముగియబోతుంది. గడువు ముగిసిన తర్వాత అల్లు అర్జున్ కి రెగ్యులర్ బెయిల్ వస్తుందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారిన అంశం.
అల్లు అర్జున్ కాలు పోయిందా? కన్ను పోయిందా?
దేనికి మీ పరామర్శలు.. సినీ ప్రముఖులకు సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్న pic.twitter.com/NpMeLzGIbV
— Telugu Scribe (@TeluguScribe) December 21, 2024