https://oktelugu.com/

Shubman Gill : గిల్ భయ్యా.. నాలుగేళ్లుగా ఇదే కథ.. మెల్బోర్న్ లోనైనా దాన్ని మార్చుతావా?

గిల్.. సూపర్ ఆటగాడు.. మెరుగ్గా బ్యాటింగ్ చేయగల సామర్థ్యం ఉన్నవాడు. అయితే అటువంటి ఆటగాడు ఇటీవల తరచుగా విఫలమవుతున్నాడు. తనను తాను నిరూపించుకోలేకపోతున్నాడు. అతని వైఫల్యం జట్టు విజయాల మీద తీవ్రంగా ప్రభావం చూపిస్తోంది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : December 21, 2024 / 04:09 PM IST

    Shubman Gill

    Follow us on

    Shubman Gill :  గిల్ సూపర్ ఆటగాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. దీటుగా బ్యాటింగ్ చేయడంలో అతడికి అతడే సాటి. ఇటీవల కాలంలో అతడు విఫలమవుతున్నాడు. బలమైన ఇన్నింగ్స్ నిర్మించడంలో విజయవంతం కాలకపోతున్నాడు. అయితే తనను తాను నిరూపించుకోవడానికి గిల్ కు ఇంకా రెండు మ్యాచ్ లు మాత్రమే చేతిలో ఉన్నాయి.. ప్రస్తుతం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడుతున్న టీమ్ ఇండియాలో అతడు కీలక ఆటగాడు. ఓపెనర్ గా బరిలోకి దిగుతున్నాడు. తొలి టెస్ట్ లో అతడు గాయం కారణంగా ఆడలేదు. అతడి స్థానంలో కేఎల్ రాహుల్ ఓపెనర్ గా బరిలోకి దిగాడు. ఇక రెండో టెస్టులో అతడు అందుబాటులోకి వచ్చాడు. మూడవ టెస్టులోనూ ఆడాడు. రెండవ, మూడవ టెస్టులో అతడు విఫలమయ్యాడు..ఇక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా, ఆస్ట్రేలియా ఒక్కో మ్యాచ్ లో విజయం సాధించాయి. మరో మ్యాచ్ డ్రా గా ముగిసింది.

    బోర్డర్, గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మెల్ బోర్న్ లో తలపడనున్నాయి.. గతంలో
    ఆస్ట్రేలియా లో గిల్ ఆడిన తొలి మ్యాచ్ లో మొదటి ఇన్నింగ్స్ లో 45 రన్స్ చేశాడు. రెండవ ఇన్నింగ్స్ లో 35* రన్స్ చేశాడు. అతడి ఇన్నింగ్స్ వల్ల భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది.. నాడు గిల్ ఆడిన తొలి ఇన్నింగ్స్ లో రోహిత్ శర్మతో కలిసి 70 రన్స్ భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేశాడు. ఇదే క్రమంలో టెస్టులలో తన తొలి అర్థ సెంచరీ నమోదు చేశాడు. రెండవ ఇన్నింగ్స్ లో కేవలం 31 రన్స్ మాత్రమే చేశాడు. తొలి ఇన్నింగ్స్ లో కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి 70 రన్స్ పార్ట్ నర్ షిప్ నమోదు చేశాడు. ఇక అప్పట్లో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో గిల్ తొలి ఇన్నింగ్స్ లో 7 పరుగులు చేశాడు. కమిన్స్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. రెండవ ఇన్నింగ్స్ లో 91 రన్స్ చేశాడు. ఇది భారత జట్టును మూడు వికెట్ల తేడాతో గెలిచేలా చేసింది..

    కేఎల్ రాహుల్ తో కలిసి..

    ఇక ప్రస్తుత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అడిలైడ్ మైదానంలో జరిగిన టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో గిల్ 31 రన్స్ చేశాడు. కేఎల్ రాహుల్ తో కలసి 69 రన్స్ చేశాడు. రెండవ ఇన్నింగ్స్ లో 28 రన్స్ మాత్రమే చేశాడు. బ్రిస్బేన్ టెస్టులో గిల్ తొలి ఇన్నింగ్స్ లో ఒక పరుగు మాత్రమే చేసాడు. రెండవ ఇన్నింగ్స్ లో అతడికి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. వర్షం వల్ల రెండవ ఇన్నింగ్స్ ఆడే అవకాశం గిల్ కు లభించలేదు. గిల్ తనను తాను నిరూపించుకోవాలంటే ఇంకా రెండు టెస్టులు మాత్రమే మిగిలి ఉన్నాయి. టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ వెళ్లాలంటే కచ్చితంగా మిగతా రెండు టెస్టులలో విజయం సాధించాల్సి ఉంది. అది జరగాలంటే గిల్ మెరుగ్గా బ్యాటింగ్ చేయాల్సి ఉంది. లేనిపక్షంలో అది జట్టు విజయాలనే కాకుండా, జట్టులో అతడి స్థానాన్ని కూడా ప్రభావితం చేయనుంది.