UI Movie Review : ఒకప్పుడు డిఫరెంట్ సినిమాలను చేసి తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు ఉపేంద్ర…ఈయన తీసిన సినిమాలకు తెలుగులో మంచి ఆదరణ దక్కడమే కాకుండా ఆయనకంటూ ఒక సపరేట్ క్రేజ్ కూడా ఏర్పడింది. ముఖ్యంగా ఆయన సినిమాలను చూడడానికి యూత్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. చాలా సంవత్సరాల తర్వాత ఆయన యూఐ అనే ఒక సినిమాని తీశారు. ఇక ఈ సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది. ఒకప్పుడు ఉపేంద్ర ఎలాంటి మ్యాజిక్ అయితే చేశాడో అలాంటి మ్యాజిక్ ఈ సినిమాలో వర్కౌట్ అయిందా లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
కథ
ఇక ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే సత్య (ఉపేంద్ర), కల్కి (ఉపేంద్ర)అనే ఇద్దరు కొద్ది నిమిషాల వ్యవధిలోనే కవల పిల్లలుగా పుడతారు… ఇక ఇద్దరూ వేర్వేరు మనస్తత్వాలతో ఉంటారు. సత్య ఈ ప్రపంచాన్ని మార్చేయాలని చూస్తూ ఉంటాడు. కానీ కల్కి మాత్రం దానికి విరుద్ధంగా తన తల్లికి జరిగిన అన్యాయానికి రివేంజ్ తీర్చుకోవాలని చూస్తూ ఉంటాడు.
ఇక అందుకోసమే సత్య తనకు అడ్డుపడుతున్నాడని తనను బంధించి కల్కి తన పనులు నెరవేర్చుకునే విధంగా ముందుకు సాగుతూ ఉంటాడు. మరి ఈ క్రమంలోనే కల్కి తను అనుకున్నది చేయగలిగాడా సత్య తన బంధనాలను తెంచుకొని బయటికి వచ్చి ఎలాంటి మార్పులను క్రియేట్ చేశాడు. సత్య కల్కి ఇద్దరి మధ్య జరిగే పోటీలో ఎవరు గెలిచారనే విషయాలు తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…
విశ్లేషణ
ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే ఉపేంద్ర చాలా సంవత్సరాల తర్వాత ఈ సినిమాను డైరెక్ట్ చేయడం అనేది చాలా మంచి విషయమనే చెప్పాలి. అయితే ఈ సినిమాలో ఉపేంద్ర తను తెలివైన వాడినని నిరూపించుకోవడానికి ఈ సినిమాను తీసినట్టుగా తెలుస్తోంది. అలాగే ఆడియన్స్ తెలివి తక్కువ వాళ్ళు కాబట్టే తను ఏం చెప్పినా నమ్ముతారనే ఉద్దేశ్యం తో ఈ సినిమాని ట్రాక్ మీదకి తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది.
ఇక మొదటి నుంచి చివరి వరకు సినిమాని తనకు నచ్చిన రీతిలో నడిపించుకుంటూ వెళ్ళాడు. సగటు ప్రేక్షకుడు మాకు ఈ తలకాయ నొప్పి ఏంటి అని అనుకునే స్థాయి దాకా ఈ సినిమాను తీసుకెళ్లాడు అంటే ఉపేంద్ర తనకున్న పైశాచికత్వాన్ని ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశాడు. కాబట్టి ఈ సినిమా సగటు ప్రేక్షకుడి మెప్పు పొందలేదనే చెప్పాలి. క్రియేటివిటీ ఎక్కువైతే ఎలాంటి పరిణామాలు జరుగుతాయి అనేదానికి ఈ సినిమాను మనం ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు…ఉపేంద్ర మంచి నటుడు అలాగే మంచి దర్శకుడు కూడా మరి ఇలాంటి సందర్భంలో ఆయన ఎందుకు ఇలాంటి ఒక సినిమాని చేయాల్సి వచ్చింది.
ఒక మంచి కమర్షియల్ సినిమాని చేసి ప్రేక్షకుడిని ఎంగేజ్ చేయడం తద్వారా సక్సెస్ ని సాధించవచ్చు కదా ఇలా అర్థంపర్థం లేని సినిమాలను చేసి ప్రేక్షకుడిని ఎందుకు హింసించాలనుకుంటున్నాడు… ఇక ఈ సినిమాకి మ్యూజిక్ కూడా చాలావరకు మైనస్ అయింది. బ్యాగ్రౌండ్ స్కోర్ విషయానికి వస్తే అడపాదడప మెప్పించినప్పటికి మేజర్ పార్ట్ లో వచ్చే ఎమోషన్ సీన్స్ కోసం ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ అయితే ఆ సీన్స్ ను అంత బాగా ఎలివేట్ చేయలేక పోయిందనే చెప్పాలి…
ఆర్టిస్టుల పర్ఫామెన్స్
ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే ఉపేంద్ర రెండు క్యారెక్టర్లలో చాలా బాగా నటించినప్పటికి అందులో సోల్ అనేది ప్రేక్షకుడికి అర్థం కాకపోవడం వల్ల అతని క్యారెక్టర్ తో ట్రావెల్ అవ్వడం మానేసి ప్రేక్షకుడు ఈ సినిమాలో ఏం జరుగుతుందో అర్థం కాని ఒక సందిగ్ధ పరిస్థితిలో పడతాడు. తద్వారా క్యారెక్టర్ ను ఓన్ చేసుకోలేకపోతాడు. ఇక సినిమాతో సంబంధం లేకుండా ఉపేంద్ర అయితే తన పాత్రకి న్యాయం చేశాడు. కానీ తను క్రియేట్ చేసిన పాత్రలకు ఒక కన్ క్లూజన్ అయితే ఇవ్వలేకపోయాడనే చెప్పాలి… ఇక మిగతా ఆర్టిస్తులందరు వాళ్ళ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు…
టెక్నికల్ అంశాలు
ఇక ఈ సినిమా టెక్నికల్ అంశాల విషయానికి వస్తే అంత పెద్దగా ఆకట్టుకోకపోయిన కూడా విజువల్స్ కొంతవరకు మనల్ని ఎంగేజ్ చేయగలుగుతాయి. ఇక ప్రాపర్ షాట్స్ ను వాడుతూ సినిమాటోగ్రాఫర్ ఈ సినిమాని ప్రేక్షకుడికి రీచ్ అయ్యేవిధంగా తీశాడు. అయినప్పటికీ కొన్ని విజువల్స్ అయితే ప్రేక్షకుడికి సినిమా చూసిన తర్వాత కూడా గుర్తుండిపోయే విధంగా ఉండటం విశేషం…ఇక ఈ సినిమాకి ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగానే ఉన్నాయి…
ప్లస్ పాయింట్స్
ఉపేంద్ర
విజువల్స్
మైనస్ పాయింట్స్
కథ
స్క్రీన్ ప్లే
మ్యూజిక్
రేటింగ్
ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ 2/5