Cinema Viral: టాలీవుడ్ ట్రెండ్స్ నుంచి ప్రజెంట్ క్రేజీ అప్ డేట్స్ విషయానికి వస్తే.. రవితేజ ‘ఖిలాడి’ ఒక్కటే కదా రిలీజ్‌కి రెడీగా ఉంది అనుకుంటున్నారా.? మాస్ మహారాజ్ రవితేజ నటించిన ‘ఖిలాడి’ ఫిబ్రవరి 11న రిలీజ్ కానుండగా.. అదే రోజు రవితేజ సమర్పిస్తోన్న ‘FIR’ కూడా విడుదల కానుంది. ఆ సినిమాలో తమిళ నటుడు విష్ణు విశాల్ నటించాడు. ఈ ఇద్దరూ కలిసి ప్రస్తుతం ఒకే సినిమాలో నటిస్తున్నారు. కాగా.. ఒకే రోజు రవితేజ నటించి, సమర్పిస్తున్న చిత్రాలు రిలీజ్ కానుండటంతో ఏది పైచేయి సాధిస్తుందోనని ఆసక్తి నెలకొంది.

ఇక మరో అప్ డేట్ విషయానికి వస్తే.. డైరెక్టర్ రాంగోపాల్ వర్మ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చనిపోయిన వ్యక్తులకు RIP (REST IN PEACE) చెప్పొద్దని ట్వీట్ చేశాడు. ‘చనిపోయిన వ్యక్తులకు RIP చెప్పడం అంటే వారిని అవమానపరచడమే. ఎందుకంటే ఇక్కడ శాంతియుతంగా విశ్రాంతి తీసుకునే వ్యక్తులను సోమరిపోతులు అంటారు. కాబట్టి ఒక వ్యక్తి చనిపోతే.. “RIP” బదులు “మంచి జీవితాన్ని గడపండి. మరింతగా ఎంజాయ్ చేయండి” అని చెప్పాలి’ అంటూ ఆర్జీవీ ట్వీట్ చేశాడు.
Also Read: సిలిండర్ బుకింగ్‌పై రూ.75 డిస్కౌంట్ పొందే ఛాన్స్.. ఏ విధంగా అంటే?

ఇక మరో అప్ డేట్ విషయానికి వస్తే.. ఈ సారి తెలుగు బిగ్‌బాస్ పోగ్రాంను ఓటీటీలో ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో పాల్గొనే కంటెస్టెంట్ల గురించి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. వీరిలోముమైత్ ఖాన్, ఆదర్శ్ బాలకృష్ణ, అరియానా గ్లోరీ, అఖిల్ సార్థక్, ఆశు రెడ్డి, రోడ్ రైడా, తనీష్, స్రవంతి, ధన్ రాజ్, నిఖిల్, యాంకర్ శివ, వరంగల్ వందన, మిత్రాశర్మ, ఆర్‌జే చైతు పాల్గొంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Also Read: వైరల్ అవుతున్న టుడే క్రేజీ అప్ డేట్స్ !