OTT Ban: ఓటీటీ అత్యంత ఆదరణ పొందుతున్న వినోద మార్గం. వరల్డ్ వైడ్ కంటెంట్ ఇంట్లో కూర్చుని చూసే సులువైన విధానం. టికెట్స్ బుక్ చేసుకోవాలి, క్యూ లైన్లో నిలబడాలనే అనే జంజాటం లేదు. థియేటర్స్ వరకు ప్రయాణ, పాప్ కార్న్, కూల్ డ్రింక్ ఖర్చులు ఉండవు. ముగ్గురు సభ్యులు కలిగిన ఒక చిన్న ఫ్యామిలీ సినిమాకు వెళ్లాలన్నా వెయ్యి రూపాయలు ఖర్చు అవుతాయి. ఇంట్లో కూర్చుని ఎంజాయ్ చేసే ఓటీటీ ఈజ్ బెస్ట్ అంటున్నారు జనాలు. పెరిగిన సాంకేతికత కారణంగా అత్యంత క్వాలిటీ పిక్చర్, సౌండ్ సిస్టమ్ కలిగిన టెలివిజన్స్, హోమ్ థియేటర్స్ అందుబాటులో ఉన్నాయి.
మొత్తంగా ఓటీటీ కంటెంట్ కి అలవాటుపడేవారి సంఖ్య ఎక్కువైంది. అయితే ఓటీటీతో దుష్ప్రభావాలు లేకపోలేదు. ముఖ్యంగా పిల్లలు, యువతపై డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ లో స్ట్రీమ్ అవుతున్న కంటెంట్ ప్రభావం చూపుతుంది. డిజిటల్ కంటెంట్ కి చెప్పుకోదగ్గ స్థాయిలో పరిమితులు లేవు. సెన్సార్షిప్ అంతంత మాత్రమే. దానికి తోడు వివిధ దేశాలకు చెందిన అంతర్జాతీయ కంటెంట్ భారతీయ విలువలు, సంస్కృతిని దెబ్బ తీస్తుంది.
Also Read: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ తో సినిమాకు సిద్ధం అంటున్న కన్నడ స్టార్ డైరెక్టర్…
ఇండియన్ చిత్రాలు, సిరీస్లలతో పోల్చుకుంటే ఫారిన్ కంటెంట్ బోల్డ్ గా ఉంటుంది. వైలెన్స్, న్యూడిటీ, ఫోల్ లాంగ్వేజ్ సర్వసాధారణం. ముఖ్యంగా సిరీస్లలో మితిమీరిన పోకడలను మనం చూడొచ్చు. ఇండియన్ మేకర్స్ కూడా ఈ తరహా కంటెంట్ ఆడియన్స్ కి పరిచయం చేసేందుకు ఇష్టపడుతున్నారు. ఇది భావితరాలను నాశనం చేసే అవకాశం కలదని సాంప్రదాయ వాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Ester Noronha: మగాళ్ల కే కాదు ఆడవాళ్లకు కోరికలుంటాయి.. ఎస్తేర్ హాట్ కామెంట్స్
ముంబైలో జరిగిన ఓ సంఘటన దిగ్బ్రాంతికి గురి చేసింది. పని ఒత్తిడిలో ఉన్న పేరెంట్స్ పిల్లలను పట్టించుకోవడం మానేశారు. వినోదం కోసం డిజిటల్ కంటెంట్ కి అలవాటు పడ్డ వారి ఇద్దరి పిల్లలు బట్టలు లేకుండా ఒకే రూమ్ లో పడుకోవడం చూసి షాక్ కి గురయ్యారు. సినిమా అనేది అత్యంత ప్రభావితం చేసే మాధ్యమం. విపరీత పోకడలతో కూడిన డిజిటల్ కంటెంట్ ప్రమాదం అంటున్నాయి కొన్ని ఎన్జీవో సంస్థలు. ఓటీటీ సంస్థలను ఇండియాలో బ్యాన్ చేయాలి. లేదంటే కనీసం కంటెంట్ విషయంలో కఠిన నియమాలు పాటించాలి ఉంటున్నారు. గతంతో పోల్చితే మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ నిబంధనలు తెరపైకి తెచ్చింది. అవి అమలు అవుతున్న సూచనలు కనపడటం లేదు. అయితే ఓటీటీ సంస్థలను బంద్ చేస్తే… సినిమా ప్రియులకు షాక్ తప్పదు.