https://oktelugu.com/

మెగాస్టార్ ‘లూసిఫర్’ పై ఇంట్రస్టింగ్ అప్ డేట్ !

మెగాస్టార్ చిరంజీవి యంగ్ స్టార్ డైరెక్టర్ సుజీత్ తో ‘లూసిఫర్’ తెలుగు రీమేక్ చేయబోతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా గురించి ఫిల్మ్ సర్కిల్స్‌ లో వినిపిస్తోన్న లేటెస్ట్ అప్ డేట్ ఏమిటంటే, తెలుగు ఆడియన్స్ కోరుకునే ఎమోషన్స్ కి తగ్గట్టుగా లూసిఫెర్ స్క్రిప్ట్‌ లో మెగాస్టార్ కొన్ని కీలకమైన మార్పులను సూచించాడట. సుజీత్ ఆ మార్పులను పూర్తి చేసి చిరుకి పూర్తి స్క్రిప్ట్‌ వినిపించారని, ఫైనల్ గా మెగాస్టార్ స్క్రిప్ట్ కి గ్రీన్ సిగ్నల్ […]

Written By:
  • admin
  • , Updated On : June 20, 2020 / 06:48 PM IST
    Follow us on


    మెగాస్టార్ చిరంజీవి యంగ్ స్టార్ డైరెక్టర్ సుజీత్ తో ‘లూసిఫర్’ తెలుగు రీమేక్ చేయబోతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా గురించి ఫిల్మ్ సర్కిల్స్‌ లో వినిపిస్తోన్న లేటెస్ట్ అప్ డేట్ ఏమిటంటే, తెలుగు ఆడియన్స్ కోరుకునే ఎమోషన్స్ కి తగ్గట్టుగా లూసిఫెర్ స్క్రిప్ట్‌ లో మెగాస్టార్ కొన్ని కీలకమైన మార్పులను సూచించాడట. సుజీత్ ఆ మార్పులను పూర్తి చేసి చిరుకి పూర్తి స్క్రిప్ట్‌ వినిపించారని, ఫైనల్ గా మెగాస్టార్ స్క్రిప్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని.. ప్రస్తుతం సాయి మాధవ్ బుర్రా డైలాగ్ వెర్షన్ రాస్తున్నారని తెలుస్తోంది.

    కనుమరుగు కథ.. కాంగ్రెస్ చేసిన పెద్ద తప్పు అదే!

    ఇక ‘లూసిఫర్’లో మంజు వార్యర్, హీరోకి చెల్లి పాత్రలో నటించింది. అయితే మంజు వార్యర్ పాత్రలోనే విజయశాంతి కనిపించబోతుందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ అందులో వాస్తవం లేదట. ఇక ఈ సినిమాలో హీరోయిజమ్ ఎలివేషన్స్ ఉన్న సీన్స్ మెయిన్ హైలైట్ గా ఉండేలా.. మెగా అభిమానులకు ఫుల్ జోష్ ని ఇచ్చేలా సినిమాని తెరకెక్కించాలని సుజిత్ షాట్ మేకింగ్ పై ప్రత్యేక దృష్టి పెట్టాడట.

    అయితే గత సంవత్సరం సుజీత్ దర్శకత్వంలో వచ్చిన భారీ విజువల్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ సాహో మిశ్రమ ఫలితాలను అందుకుంది. అయినప్పటికి మెగాస్టార్ చిరంజీవి సుజీత్ టాలెంట్ పై నమ్మకముంచి అతనికే ఈ భారీ మూవీని రీమేక్ చేసే అవకాశం ఇచ్చారు.

    Tags