https://oktelugu.com/

కనుమరుగు కథ.. కాంగ్రెస్ చేసిన పెద్ద తప్పు అదే!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చెరగని ముద్రవేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ ను అత్యధిక సంవత్సరాలు పాలించిన పార్టీగా రికార్డుల్లోకి ఎక్కింది. 9 ఏళ్ల చంద్రబాబు పాలనకు చరమగీతం పాడేందుకు నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాష్ట్రమంతా పాదయాత్ర చేసి అధమ స్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఊపిరిలూది అధికారంలోకి తీసుకొచ్చారు. వరుసగా పదేళ్లపాటు నిలబెట్టారు. ఉమ్మడి ఏపీ విడిపోయే వరకు కూడా కాంగ్రెస్ పాలనే కొనసాగింది. కాంగ్రెస్ లేని ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఊహించలేం. కాంగ్రెస్ తో అనుబంధం […]

Written By:
  • NARESH
  • , Updated On : June 20, 2020 / 06:36 PM IST
    Follow us on


    ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చెరగని ముద్రవేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ ను అత్యధిక సంవత్సరాలు పాలించిన పార్టీగా రికార్డుల్లోకి ఎక్కింది. 9 ఏళ్ల చంద్రబాబు పాలనకు చరమగీతం పాడేందుకు నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాష్ట్రమంతా పాదయాత్ర చేసి అధమ స్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఊపిరిలూది అధికారంలోకి తీసుకొచ్చారు. వరుసగా పదేళ్లపాటు నిలబెట్టారు. ఉమ్మడి ఏపీ విడిపోయే వరకు కూడా కాంగ్రెస్ పాలనే కొనసాగింది.

    కాంగ్రెస్ లేని ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఊహించలేం. కాంగ్రెస్ తో అనుబంధం నిన్నటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ కు ఉండేది. 100 ఏళ్ల పార్టీ ఉనికి ఆంధ్రప్రదేశ్ లో నిన్నటితో సమాప్తమైంది.

    రెబల్ ఎమ్మెల్యేలపై టీడీపీ చర్యలు తీసుకుంటుందా?

    నిజానికి కాంగ్రెస్ 2014 ఎన్నికల్లో ఉమ్మడి ఏపీని విడగొట్టినప్పుడే ఏపీలో భూస్థాపితమైపోయింది. తెలంగాణలో ప్రతిపక్షానికి పరిమితమైంది. మరి ఈ ఆరేళ్లు ఎలా తన ఉనికి ఏపీలో చాటిందంటే అది రాజ్యసభ ఎంపీలుగా కాంగ్రెస్ పార్టీ నుంచి నాడు ఎన్నికైన వారి కాలపరిమితి నేటితో తీరిపోయింది.

    ఇన్నాళ్లు కాంగ్రెస్ నామినేట్ చేసిన కేవీపీ రాంచంద్రరావు, సుబ్బిరామిరెడ్డి లాంటి తదితర వారి కాలపరిమితి నిన్నటి రాజ్యసభ ఎన్నికలతో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. నిన్నటి వరకు కూడా వారు రాజ్యసభ ఎంపీలుగా కొనసాగారు. వారిద్దరూ కాంగ్రెస్ ఎంపీలే. నాడు ఉమ్మడి ఏపీ చివరి హయాంలో నామినేట్ అయినవారు. 6 ఏళ్లుగా ఏపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

    బీజేపీ చర్యలకు… పవన్ జవాబుదారు కాదా?

    ఆంధ్రప్రదేశ్ లో శుక్రవారం జరిగిన రాజ్యసభ ఎన్నికలు కొత్త చరిత్రను సృష్టించాయి. ఏపీ నుంచి పూర్తిగా కాంగ్రెస్ ను ఈ ఎన్నికలు తుడిచివేశాయి. కాంగ్రెస్ ముక్త ఆంధ్రప్రదేశ్ గా ఈ ఎన్నికలతో మారిపోయింది. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వైట్ వాష్ తర్వాత ఏపీ శాసనమండలితోపాటు రాజ్యసభలో ఏపీ కోటా నుంచి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీ ఎంతో చరిత్ర కలిగిన ఏపీలో ఇప్పుడు పూర్తిగా కనుమరుగైన వైనం తాజాగా చోటుచేసుకుంది.

    కాంగ్రెస్ పార్టీ చేసిన అతిపెద్ద తప్పు వైఎస్ జగన్ ను తక్కువగా అంచనావేయడం.. అతడిని పార్టీ నుంచి సాగనంపడం.. జగన్ ఒక ప్రాంతీయ పార్టీని ఏర్పాటు చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభ మెల్లిమెల్లిగా ఏపీలో కోల్పోవడం ప్రారంభించింది. ముఖ్య నాయకులందరినీ ఒక్కొక్కరిగా కోల్పోయింది. ఇప్పుడు పూర్తిగా ఏపీలో కనుమరుగైంది.

    ఏపీ విడిపోయాక తొలి ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా కాడి వదిలి సొంత ఊళ్లో వ్యవసాయం చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఆయన ప్లేసులో భర్తీ అయిన కొత్త పీసీసీ చీఫ్ శైలజానాథ్ అస్సలు కాంగ్రెస్ ను భుజానకెత్తుకోవడం లేదు. ఒక్క పర్యటన కూడా చేపట్టడం లేదు. దీంతో కాంగ్రెస్ ఎలాగూ ఏపీలో బలపడదని వారికి అర్థమై నిద్రాన స్థితిలోనే వదిలేస్తున్నారు. ఇప్పుడు రాజ్యసభ ఎన్నికలతో కాంగ్రెస్ కథ పూర్తిగా కంచికి చేరింది..