https://oktelugu.com/

కేసీఆర్ కరుణిస్తాడా? కాలదన్నుతాడా?

టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఈ మధ్య ఏదీ తొందరగా తేల్చడం లేదు. కరోనా లాక్ డౌన్ తో ఇప్పుడు రాజకీయమే బంద్ అయిపోయింది. దీంతో పదవుల పందేరంలో మరింత ఆలస్యం చేస్తున్నారు కేసీఆర్. తెలంగాణలో సీఎం కేసీఆర్ రెండోసారి గద్దెనెక్కకా.. స్లో అండ్ స్టడీగా ముందుకు సాగుతున్నారు. మొదటి దఫాలో ఠంచనుగా నామినేటెడ్ పదవుల భర్తీ చేసిన కేసీఆర్ ఇప్పుడు సంవత్సరం దాటుతున్నా ఆ ఊసే ఎత్తడం లేదు. దీంతో ఖాళీ అయ్యే సీట్లపై నేతలు […]

Written By:
  • NARESH
  • , Updated On : June 20, 2020 / 07:00 PM IST
    Follow us on


    టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఈ మధ్య ఏదీ తొందరగా తేల్చడం లేదు. కరోనా లాక్ డౌన్ తో ఇప్పుడు రాజకీయమే బంద్ అయిపోయింది. దీంతో పదవుల పందేరంలో మరింత ఆలస్యం చేస్తున్నారు కేసీఆర్. తెలంగాణలో సీఎం కేసీఆర్ రెండోసారి గద్దెనెక్కకా.. స్లో అండ్ స్టడీగా ముందుకు సాగుతున్నారు. మొదటి దఫాలో ఠంచనుగా నామినేటెడ్ పదవుల భర్తీ చేసిన కేసీఆర్ ఇప్పుడు సంవత్సరం దాటుతున్నా ఆ ఊసే ఎత్తడం లేదు. దీంతో ఖాళీ అయ్యే సీట్లపై నేతలు కన్నేశారు.టీఆర్ఎస్ లో ఈ నెలాఖరుకు మూడు ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అవుతున్నాయి. దీంతో ఎమ్మెల్సీ పదవుల సందడి మొదలైంది. ఈ మూడు పదవుల కోసం నేతలంతా గులాబీ దళపతిని ప్రసన్నం చేసుకోవడానికి తెగ కష్టపడుతున్నారు. ఎవరికి తోచిన దారిలో వారు లాబీయింగ్ మొదలు పెడుతున్నారు.

    కనుమరుగు కథ.. కాంగ్రెస్ చేసిన పెద్ద తప్పు అదే!

    ఈనెల 17తో మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పదవీకాలం ముగుస్తోంది. ఆగస్టులో మరో ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ది ముగుస్తోంది. ఇక కాంగ్రెస్ లో చేరి అనర్హత వేటుపడ్డ రాములునాయక్ ది కూడా ముగిసిపోయింది. ఈ మూడు స్థానాలకు అభ్యర్థుల కోసం కేసీఆర్ కసరత్తు ప్రారంభించారు.

    ఇప్పటికే నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి కేసీఆర్ కూతురు కవిత నామినేషన్ వేశారు. ఇప్పుడు గవర్నర్ కోటాలోని మూడు స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయబోతున్నారు సీఎం కేసీఆర్.

    రెండోసారి గద్దెనెక్కి ఏడాది దాటినా కేసీఆర్ పదవుల భర్తీపై అస్సలు ఆసక్తి చూపడం లేదు. తెలంగాణలో ఇప్పుడు పదవుల భర్తీ కోసం నేతలంతా ఆశగా ఎదురుచూస్తున్నారు.. ఆ మూడు ఎమ్మెల్సీల పదవుల కోసం బారెడు క్యూ నెలకొంది. దాదాపు 30 మంది పోటీ పడుతున్నారు. ఇందులో కేసీఆర్ హామీనిచ్చిన వారితోపాటు ఆశావహులు ఉన్నారు. ప్రధానంగా కేసీఆర్ స్వయంగా ఇంటికెళ్లి మరీ పార్టీలోకి ఆహ్వానించిన నిజామాబాద్ మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీ బూర నర్సయ్య, ఉద్యోగ నేతలు స్వామిగౌడ్, దేవీ ప్రసాద్ తోపాటు బస్వరాజు సారయ్య, సీతారాం నాయక్, వేముల వీరేశం, క్యామ మల్లేష్ లు ప్రధానంగా ఎమ్మెల్సీ బరిలో ప్రయత్నాలు చేస్తున్నారు. కేసీఆర్ ఫాంహౌస్ చుట్టూ , ప్రగతి భవన్ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు.

    జగన్ బాటలోనే సీఎం కేసీఆర్?

    కరోనా కారణంగా మిగతా నామినేటెడ్ పదువులు ఇప్పట్లో భర్తీ చేసే యోచనలో కేసీఆర్ లేడు. దీంతో ఇప్పుడు అందరిచూపు తెలంగాణలో ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీ పదవులపై పడింది. ఈ పదవిని దక్కించుకునేందుకు రకరకాల మార్గాల్లో నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.

    ఈ మూడు స్థానాల్లో కర్నె ప్రభాకర్ కు మళ్లీ కేసీఆర్ అవకాశం ఇస్తారని టీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నాయి. ఆయన టీఆర్ఎస్ లో యాక్టివ్ గా ఉంటూ పార్టీ వాయిస్ ను బలంగా వినిపిస్తుంటాడు. ఇక కేసీఆర్ కేబినెట్ లో తొలి హోంమంత్రి అయిన నాయిని నర్సింహారెడ్డికి ఈసారి కేసీఆర్ ఇస్తాడో లేదో తెలియకుండా ఉంది. ఆయన ఈ మధ్య కేసీఆర్ గురించి లూజ్ టాక్ చేయడం మైనస్ గా మారింది. ఇక మూడో సీటులో కొత్త నేతకు అవకాశం గ్యారెంటీగా కనిపిస్తోంది. ఈ మూడు పదవుల కోసం టీఆర్ఎస్ లో దాదాపు 30మందికి పైగా ప్రయత్నాలు చేస్తున్నారు. పురుషుల్లో చాలా మంది ఉండగా.. కేసీఆర్ కు దగ్గరగా ఉండే పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మహిళా కోటాలో ప్రధానంగా తుల ఉమ, గుండు సుధారాణి, ఉమా మాధవరెడ్డి రేసులో ఉన్నారు. అంతిమంగా ఈ పదవులు ఎవరికి దక్కుతాయనేది ఆసక్తిగా మారింది