Allu Aravind- Chiranjeevi : అల్లు అరవింద్ చేతిలో దారుణం గా మోసపోయిన చిరంజీవి…

ప్రస్తుతం చిరంజీవి వశిష్ట డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు ఈ సినిమా పూర్తి అయిన వెంటనే మరో సినిమా చేసే విధంగా ప్రణాళికలను రూపొందించుకుంటున్నాడు...

Written By: Gopi, Updated On : October 29, 2023 6:04 pm
Follow us on

Allu Aravind- Chiranjeevi : చిరంజీవి వరుస సినిమాలు చేస్తూ మెగాస్టార్ గా ఎదిగారు. ఇక ఈ క్రమంలోనే ఆయన చేసిన ప్రతి సినిమా కూడా మంచి విజయాన్ని అందుకోవడంతో పాటుగా ఇండస్ట్రీలో చిరంజీవి స్థాయిని మరింత పెంచిందనే చెప్పాలి. ఇక ఇలాంటి క్రమంలో అల్లు అరవింద్ కూడా చాలా సినిమాలకు ప్రొడ్యూస్ చేస్తూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన పేరు ని సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నారు.అల్లు అరవింద్ ఇప్పుడు ఇండస్ట్రీ లో ఉన్న ప్రొడ్యూసర్ లలో వన్ ఆఫ్ ది టాప్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్నారు.ఇక ఒకే సమయంలో చిరంజీవి అటు హీరోగా, అల్లు అరవింద్ ఇటు ప్రొడ్యూసర్ గా చాలా తక్కువ సమయంలోనే ఎదిగారు…

అయితే చిరంజీవి చేసే సినిమాల పట్ల అల్లు అరవింద్ అప్పట్లో చాలా కేర్ తీసుకునేవాడు ఏ డైరెక్టర్ తో చిరంజీవి సినిమా చేస్తే బాగుంటుంది అనే కోణంలో ఆలోచించి ఆ కాంబినేషన్ సెట్ చేసేవాడు. అలా చిరంజీవి సక్సెస్ లో అరవింద్ కీలకపాత్ర వహించాడనే చెప్పాలి. ఇక ప్రస్తుతం చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చి అదరగొడుతున్న విషయం మనకు తెలిసిందే.అయితే చిరంజీవి కె విశ్వనాథ్ తో చేసిన ఆపద్బాంధవుడు, స్వయంకృషి లాంటి సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. అయితే అల్లు అరవింద్ కి చిరంజీవి విశ్వనాథ్ గారితో చేస్తే బాగుంటుంది అని అనిపించడం తో విశ్వనాథ్ గారి దగ్గరికి వెళ్లి చిరంజీవి గారు మీతో సినిమా చేయడానికి రెడీగా ఉన్నారని చెప్పి విశ్వనాథ్ గారిని సినిమా కి ఒప్పించారు,అలాగే విశ్వనాథ్ గారు నీతో సినిమా చేయడానికి రెడీగా ఉన్నారని చెప్పి చిరంజీవిని సినిమాకి ఒప్పించారు.

ఇలా వీరిద్దరినీ మోసం చేసి అల్లు అరవింద్ వీళ్ళ కాంబినేషన్ ని సెట్ చేశాడు…ఇక ఈ విషయాలను అల్లు అరవింద్ తనే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో తెలియజేయడం జరిగింది. వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన రెండు సినిమాలు కూడా మంచి విజయాలను అందుకున్నాయి.ఇక చిరంజీవి అప్పటివరకు మాస్ హీరోగా ఉండడంతో తనకొక డిఫరెంట్ క్యారెక్టర్ ని చేసి నటుడిగా తనకంటూ ఒక స్థాయిని ఏర్పాటు చేసుకున్నాడు…

ఈ రెండు సినిమాలు చిరంజీవి కెరియర్ లో అత్యంత కీలకమైన సినిమాలనే చెప్పాలి ఎందుకంటే వీటిలో చిరంజీవి నటన అత్యద్భుతంగా ఉంటుంది. ఇప్పటివరకు ఆయన ఏ సినిమాలో కూడా అలాంటి నటనని కనబరచలేదనే చెప్పాలి. ఇక ప్రస్తుతం చిరంజీవి వశిష్ట డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు ఈ సినిమా పూర్తి అయిన వెంటనే మరో సినిమా చేసే విధంగా ప్రణాళికలను రూపొందించుకుంటున్నాడు…