https://oktelugu.com/

Horoscope Today : ఈరోజు తొలి ఏకాదశి.. బుధాదిత్యం.. కారణంగా ఈ రాశుల వారికి రాజయోగం..

వ్యాపారులు ప్రయాణం చేసేటప్పుుడు జాగ్రత్తగా ఉండాలి. బడ్జెట్ ను దృష్టిలో ఉంచుకొని ఖర్చులను నియంత్రించాలి. కుటుంబ సభ్యుల సహకారంతో కొన్ని పెండింగు పనులను పూర్తి చేస్తారు. విద్యార్థులకు అనుకున్న ఫలితాలు ఉంటాయి.

Written By:
  • NARESH
  • , Updated On : July 17, 2024 / 09:29 AM IST

    Ekadashi Horoscopes

    Follow us on

    Horoscope Today: 2024 జూలై 17 బుధవారం రోజున ద్వాదశ రాశులపై అనురాధ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు వృశ్చిక రాశిలో సంచారం చేయనున్నాడు. బుధవారం తొలి ఏకాదశి సందర్భంగా శ్రీ విష్ణువు అనుగ్రహం ఉండనుంది. నవ పంచమ యోగం, బుధాదిత్యం వల్ల కొన్ని రాశుల వారికి రాజయోగం కలగనుంది. మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

    మేష రాశి:
    ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. శత్రువులు పక్కనే ఉంటారు. అందువల్ల ప్రతి ఒక్క వ్యక్తిని గమనించాలి. విద్యార్థులు కెరీర్ కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటారు. ఆరోగ్య సమస్యలపై వైద్యుడిని సంప్రదించాలి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండాలి.

    వృషభ రాశి:
    ఉపాధి పొందాలనుకునేవారికి అనుకూల సమయం. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఖర్చులను నియంత్రించాలి. కుుటంబ సంబంధాలు మెరుగవుతాయి. వివాహానికి సంబంధించి కొత్త ప్రతిపాదనలు వస్తాయి. వృథా ఖర్చులు ఉంటాయి. వాటికి దూరంగా ఉండాలి.

    మిథున రాశి:
    కుటుంబంలో కొన్ని సమస్యలు ఏర్పడొచ్చు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. ఆర్థిక పరంగా మంచి లాభాలు ఉంటాయి. వ్యాపారులు కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. ఉద్యోగులకు స్థాన చలనం ఉంటుంది.

    కర్కాటక రాశి:
    ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. కొత్తగా పెట్టుబడి పెట్టాలనుకునేవారికి మంచి సమయం. పెద్దల సహకారంతో కొన్ని పెండింగు పనులు పూర్తవుతాయి. ఇంటికి అతిథుల రాకతో సందడిగా ఉంటుంది.

    సింహారాశి:
    ప్రత్యర్థుల కుట్రలకు బలికాకుండా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. కుటుంబ సభ్యులపై కేర్ తీసుకోవాలి. వ్యాపారులకు లాభాలతో పాటు కొన్ని ఖర్చులు ఉంటాయి. ఉద్యోగులకు సీనియర్ల మద్దతు ఉంటుంది.

    కన్య రాశి:
    పెండింగు పనులను పూర్తి చేస్తారు. వ్యాపారులు కొన్ని చిక్కులను ఎదుర్కొంటారు. అయితే కొత్త ప్రణాళికలు ఏర్పాటు చేసుకుంటారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారు. ఉద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది.

    తుల రాశి:
    జీవిత భాగస్వామితో వాగ్వాదం ఉండే అవకాశం. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. విద్యార్థులు భవిష్యత్ కు సంబంధించి కొన్ని పనులు పూర్తి చేస్తారు. పిల్లలతో సరదాగా ఉంటారు. వివాహానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

    వృశ్చిక రాశి:
    భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని కొత్త పెట్టుబడులు పెడుతారు. సాయంత్ర స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు తమ టాస్క్ ను నేడు పూర్తి చేస్తారు. దీంతో సీనియర్ల నుంచి ప్రశంసలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

    ధనస్సు రాశి:
    కుటుంబ సభ్యుల సలహాతో కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. రాజకీయ నాయకులకు ఏదంటే అది అవుతుంది. ఉద్యోగులు పదోన్నతి పొందే అవకాశాలు ఎక్కువ. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. అనుకోని శుభ ఫలితాలు పొందుతారు. వ్యాపారులకు కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు ఉంటుంది.

    మకర రాశి:
    లక్ష్య సాధన కోసం విద్యార్థులు ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది. వ్యాపారులకు అనుకోని లాభాలు ఉంటాయి. ఆర్థికంగా పుంజుకుంటారు. కొత్త పనిని మొదలు పెట్టడానికి ఇదే మంచి సమయం. వ్యాపారులు కొత్త పెట్టుబడులకు సరైన సమయం. సమాజంలో గౌరవం పెరుగుతుంది.

    కుంభరాశి:
    కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. జీవిత భాగస్వామితో వాదనలు ఉండే అవకాశం. మానసికంగా ఒత్తిడిని ఎదుర్కొంటారు. సాయంత్రం స్నేహితులతో సరదాగా ఉంటారు. పెండింగు పనులను పూర్తి చేస్తారు. ఏ పని చేసినా జాగ్రత్తగా వ్యవహిరించాలి.

    మీనరాశి:
    వ్యాపారులు ప్రయాణం చేసేటప్పుుడు జాగ్రత్తగా ఉండాలి. బడ్జెట్ ను దృష్టిలో ఉంచుకొని ఖర్చులను నియంత్రించాలి. కుటుంబ సభ్యుల సహకారంతో కొన్ని పెండింగు పనులను పూర్తి చేస్తారు. విద్యార్థులకు అనుకున్న ఫలితాలు ఉంటాయి.