Homeఎంటర్టైన్మెంట్Megastar Chiranjeevi Villain Role: చిరంజీవి కి ఆ క్యారెక్టర్ చేయాలని ఉందట...వద్దంటే వద్దంటున్న రామ్...

Megastar Chiranjeevi Villain Role: చిరంజీవి కి ఆ క్యారెక్టర్ చేయాలని ఉందట…వద్దంటే వద్దంటున్న రామ్ చరణ్…

Megastar Chiranjeevi Villain Role: గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న నటుడు మెగాస్టార్ చిరంజీవి… ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిద్యమైతే ఉంటుంది. ఇప్పటివరకు ఆయన పోషించని పాత్ర లేదు. అందుకోని అవార్డు లేదు. ప్రేక్షకులందరు అతని నటన చూడి ఆయనకి ఏకగ్రీవంగా మెగాస్టార్ అనే బిరుదులు కూడా ఇచ్చి సత్కరించుకున్నారు. ఇక అలాంటి చిరంజీవి ఈ ఏజ్ లో కూడా ఎక్కడ తగ్గకుండా యంగ్ హీరోలకు పోటీని ఇస్తూ ముందుకు సాగుతున్నాడు అంటే మామూలు విషయం కాదు… అలాంటి హీరో తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరొకరు ఉండరనేది వాస్తవం… అలాంటి హీరో ఇప్పుడు చేయబోతున్న సినిమాల విషయంలో సైతం పలు జాగ్రత్తలైతే తీసుకుంటున్నాడు. చిరంజీవి తన ఎంటైర్ కెరియర్ లో ఒక అసంతృప్తి అయితే మిగిలిపోయిందట. పవర్ ఫుల్ విలన్ పాత్రలో నటించి ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకోవాలని చూస్తున్నారట.

Also Read: విజయ్-త్రిషల ప్రేమకి ‘విక్రమ్-జ్యోతిక’లే కారణమా? ఆసక్తికరమైన కథనం!

కానీ అతన్ని విలన్ గా చూడడానికి ప్రేక్షకులు సిద్ధంగా లేరంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇక ఇదే విషయాన్ని రాంచరణ్ తో చెబితే రామ్ చరణ్ సైతం చిరంజీవిని విలన్ గా చేయడం వద్దంటే వద్దని వాదిస్తున్నారట. ఇక రామ్ చరణ్ సినిమాలోనే విలన్ పాత్రను పోషిస్తానని చిరంజీవి చెబుతున్నాడట. అయినప్పటికి రామ్ చరణ్ మాత్రం దానికి ఒప్పుకోవడం లేదు. ఏది ఏమైనా కూడా చిరంజీవి అన్ని తరహా పాత్రలను చేశాడు.

కానీ ఒక బలమైన విలన్ గా చేయాలనే కోరిక మాత్రం తనకు ఎప్పటి నుంచో బలంగా ఉండిపోయిందట. ఆయన పర్ఫెక్ట్ విలన్ పాత్రను పోషిస్తాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది. కెరియర్ స్టార్టింగ్ లో చాలా రకాల పాత్రను పోషించారు. అందులో విలన్ పాత్రలు కూడా ఉన్నాయి. కానీ తనకి ఒక స్టాండర్డ్ వచ్చిన తర్వాత ఆయన ఒకే రకమైన నటనకు అలవాటు పడిపోయి అవే సినిమాలను చేసుకుంటూ వస్తున్నాడు.

ఒకసారి విలనిజాన్ని చూపిస్తే తన మార్క్ ఏ రేంజ్ లో ఎలివేట్ అవుతుంది. తన నటన కూడా ప్రేక్షకులందరిని మెప్పిస్తుందా లేదా విషయంలో కూడా క్లారిటీ వస్తుందని అనుకుంటున్నారట…చిరంజీవి అనుకున్నట్టుగానే ఆయన తొందరలోనే విలన్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular