Chiranjeevi Waiting Story: సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఆర్టిస్టులందరు వాళ్ళ సినిమాల్లో చాలా బిజీగా ఉంటారు. ముఖ్యంగా హీరోలు 1,2 సినిమాలకు కమిటై వాళ్ళ సినిమాలను వాళ్ళు చేసుకుంటూ ముందుకు సాగుతుంటే కమెడియన్స్ గానీ, క్యారెక్టర్ ఆర్టిస్టులు గానీ చాలా ఎక్కువ సంఖ్యలో సినిమాలను చేస్తూ ముందుకు సాగుతూ ఉంటారు. మరి ఇలాంటి సందర్భంలోనే ఒకప్పుడు చిరంజీవి సైతం ఒకే సారి నుంచి 2,3 సినిమాలు షూటింగుల్లో బిజీగా ఉండేవాడు. కానీ అతని సినిమాల్లో నటించే కమెడియన్స్ అయిన బాబు మోహన్, బ్రహ్మానందం లాంటివారు ఎక్కువ సంఖ్యలో సినిమాలను చేస్తూ షిఫ్ట్ లుగా షూటింగ్ లో పాల్గొనేవారు. వాళ్ళకి అప్పట్లో అంతటి డిమాండ్ ఉండేది. ప్రతి సినిమాలో వాళ్ళు ఉంటే ఆ సినిమా సూపర్ సక్సెస్ అవుతుందని దర్శక నిర్మాతలు సైతం భావించేవారు. ఇక ఇలాంటి సందర్భంలోనే చిరంజీవి హీరోగా కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ముఠామేస్త్రి సినిమా సమయంలో చిరంజీవి, బాబు మోహన్, బ్రహ్మానందం మధ్య కాంబినేషన్ సీన్స్ అయితే ఉన్నాయట. అయితే ఆ సీన్స్ కంప్లీట్ చేస్తే సినిమా మొత్తం పూర్తవుతుందనే ఉద్దేశ్యంతోనే డైరెక్టర్ బాబు మోహన్ బ్రహ్మానందం కోసం మూడు నెలలుగా సమయాన్ని వేచి చూశారట…
Also Read: లోకేష్ కనకరాజ్ కి రజినీకాంత్ తో సినిమా చేయడం ఇష్టం లేదా..?
ఒకరికి డేట్ దొరికితే మరొకరికి డేట్ అడ్జస్ట్ అవ్వకపోవడం ఇలాంటి ఇబ్బందులు రావడంతో చిరంజీవి స్వయంగా బాబు మోహన్, బ్రహ్మానందం లను పిలిపించి సినిమా షూటింగ్ వీలైనంత తొందరగా అయిపోగొట్టాలి. అలాగే రిలీజ్ కూడా చేయాలి అని వాళ్లతో చెప్పినప్పటికీ వాళ్ళు డేట్స్ ఖాళీ లేవని చెప్పారట.
మరి ఏం చేద్దాం సినిమాని ఆపేద్దామా అని చిరంజీవి చెప్పడంతో కొన్ని డేట్స్ అడ్జస్ట్ చేసి ఇస్తాము అని చెప్పారట. అయినప్పటికి చిరంజీవి మీరు ఇంతకుముందు డేట్స్ ఇచ్చిన సినిమాలకు ఇబ్బంది అవుతుంది కదా అలా ఇబ్బంది అవ్వకుండా ఒక వారం రోజులపాటు రెండు గంటల సమయాన్ని కేటాయించి షూటింగ్ ను పెట్టుకుందామని చెప్పారట.
Also Read: తెలుగు హీరోలకు దెబ్బేస్తున్న బాలీవుడ్ డైరెక్టర్స్…
ఇక అందులో భాగంగానే నైట్ వీలు అవుతుందా అంటే నైట్ కుదరదని వాళ్ళు చెప్పడంతో ఎర్లీ మార్నింగ్ 4 నుంచి 6 వరకు ఫిక్స్ చేశారట… ఇక ఇచ్చిన టైం ప్రకారం షూటింగ్ కి హాజరై సినిమా షూటింగ్ ను కంప్లీట్ చేసి మొత్తానికైతే ఆ సినిమాను రిలీజ్ చేసి సూపర్ సక్సెస్ చేశారు. అలా బ్రహ్మానందం నేను అప్పట్లో చాలా బిజీ ఆర్టిస్టులుగా ఉండేవాళ్లమని రీసెంట్ గా బాబు మోహన్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ప్రస్తుతం ఆ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది…