https://oktelugu.com/

Chiranjeevi: విశ్వంభర సినిమాలో అదిరిపోయే స్టెప్పులతో దుమ్ములేపనున్న చిరంజీవి.. కొరియోగ్రాఫర్ ఎవరంటే..?

Chiranjeevi: ప్రస్తుతం ఆయన వశిష్ట డైరెక్షన్ లో విశ్వంభర అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దశ లో ఉంది. ఇక ఇదిలా ఉంటే చిరంజీవి ఆస్థాన కొరియోగ్రాఫర్ గా మారిన లారెన్స్ మాస్టర్ నేతృత్వంలో విశ్వంభర...

Written By:
  • Gopi
  • , Updated On : July 2, 2024 / 02:01 PM IST

    Chiranjeevi took amazing steps in Vishwambhara Movie

    Follow us on

    Chiranjeevi: సినిమా ఇండస్ట్రీలో కష్టపడితే తప్పకుండా ప్రతిఫలం దక్కుతుంది అని నిరూపించిన మొదటి వ్యక్తి చిరంజీవి…ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఒక సామాన్యుడు ఇండస్ట్రీలో ఎదగవచ్చు అని సామాన్య జనాల్లో సైతం ఆశలు రేకెత్తించిన ఒకే ఒక్కడు చిరంజీవి… ఇక మొత్తానికైతే ఆయన 150 కు పైన సినిమాలను చేసి ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి గుర్తింపు ను తెచ్చుకున్నారు. ఇక ఇప్పటికి ఆయన పోషించని పాత్ర అనేది లేదు.

    ఇక ప్రస్తుతం ఆయన వశిష్ట డైరెక్షన్ లో విశ్వంభర అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దశ లో ఉంది. ఇక ఇదిలా ఉంటే చిరంజీవి ఆస్థాన కొరియోగ్రాఫర్ గా మారిన లారెన్స్ మాస్టర్ నేతృత్వంలో విశ్వంభర సినిమాకు సంబంధించిన రెండు పాటలను చిత్రీకరించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. చిరంజీవి, త్రిష కాంబినేషన్ లో ఇంతకు ముందు స్టాలిన్ అనే సినిమా వచ్చింది.

    ఈ సినిమా అవరేజ్ గా ఆడినప్పటికీ వీళ్ళ కాంబినేషన్ కి మాత్రం మంచి గుర్తింపు అయితే వచ్చింది. ఇక ఇప్పుడు వీళ్లిద్దరూ మరోసారి సూపర్ సక్సెస్ ను అందుకోవాలని చూస్తున్నారు…ఇక చిరంజీవి డ్యాన్స్ వేయడం లో దిట్ట అనే విషయం మనందరికీ తెలిసిందే. ఆయన వేసే ప్రతి స్టెప్పు కూడా అభిమానుల్లో ఒక ట్రెండ్ సెట్టర్ గా మిగిలిపోతుంది. ఇక లారెన్స్ కొరియోగ్రఫీలో చిరంజీవి మూమెంట్స్ అంటే టాప్ లేచి పోతుందనే చెప్పాలి.

    ఇక వీళ్ళ కాంబో లో వచ్చిన ‘దాయి దాయి దామ్మ’ సాంగ్ లోని వీనా స్టెప్ ఇప్పటికి చాలా ప్రత్యేకమనే చెప్పాలి. ఇప్పుడు మరోసారి ‘విశ్వంభర ‘ సినిమాలో కూడా లారెన్స్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నాడు. ఇక ఇది తెలుసుకున్న చిరంజీవి అభిమానులు అందరూ ఈ సినిమాలో చిరంజీవి స్టెప్పులు చూడటానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో లారెన్స్ మాస్టర్ వేయించబోయే స్టెప్పులు ‘దాయి దాయి దామ్మ’ సాంగ్ ను మించి ఉంటాయని సినిమా యూనిట్ నుంచి సమాచారం అయితే అందుతుంది…