https://oktelugu.com/

Vijay Devarakond: విజయ్ దేవరకొండ నాగ్ అశ్విన్ లా స్నేహ బంధం ఇప్పటిది కాదట…

Vijay Devarakond: 190 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమా లాంగ్ రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ను వసూలు చేస్తుందనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఇదిలా ఉంటే హీరో విజయ్ దేవరకొండ కల్కి సినిమాలో అర్జునుడి పాత్రలో కనిపించిన విషయం మనకు తెలిసిందే.

Written By:
  • Gopi
  • , Updated On : July 2, 2024 / 02:06 PM IST

    Vijay Devarakonda Nag Ashwin

    Follow us on

    Vijay Devarakond: కల్కి సినిమాతో ఒక పెను ప్రభంజనాన్ని సృష్టించిన దర్శకుడు నాగ్ అశ్విన్..ఇది తనకు మూడో సినిమా అయినప్పటికీ ఈ సినిమాతోనే ఆయన పాన్ ఇండియా లెవెల్లో ఒక భారీ సక్సెస్ ని అందుకోవడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి. ఇక తన దాటికి బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం షేక్ అయిపోయింది. ఇక ఇండియా వైడ్ గా ఈ సినిమాకు భారీ కలెక్షన్లు కూడా రాబోతున్నాయి అనే వార్తలైతే వినిపిస్తున్నాయి.

    ఒక్కరోజులో 190 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమా లాంగ్ రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ను వసూలు చేస్తుందనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఇదిలా ఉంటే హీరో విజయ్ దేవరకొండ కల్కి సినిమాలో అర్జునుడి పాత్రలో కనిపించిన విషయం మనకు తెలిసిందే. అయితే విజయ్ దేవరకొండ నాగ్ అశ్విన్ ఇద్దరు కూడా సినిమా ఇండస్ట్రీకి రాకముందు నుంచే మంచి ఫ్రెండ్స్ గా ఉన్నారు. ఇక విజయ్ నటించిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాకు నాగ్ అశ్విన్ అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశాడు…ఇక అప్పటి నుంచి వీళ్ళ మధ్య మంచి ఫ్రెండ్షిప్ కుదిరింది.. అందువల్లే నాగ్ అశ్విన్ తీసిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాలో విజయ్ దేవరకొండ ఒక కీలక పాత్రలో నటించాడు.

    ఇక ఆ సినిమా తర్వాత మహానటి లో కూడా ఒక చిన్న పాత్రలో నటించి మెప్పించాడు. ఇక ఇప్పుడు కూడా తను పోషించింది చిన్న పాత్రే అయినప్పటికీ అందులో నటించి మెప్పించడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి. విజయ్ దేవరకొండ మంచి స్టార్ హీరోగా మారుతున్న క్రమంలో ఇలాంటి పాత్ర చేయడం అవసరమా అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నప్పటికీ ఆయన స్నేహానికి విలువ ఇచ్చి ఈ పాత్ర చేశాడు అంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

    ఇక మొత్తానికైతే ఈ సినిమాతో తను ఒక మంచి సక్సెస్ ను అందుకోవడమే కాకుండా ఫ్రెండ్షిప్ కి విలువ ఇచ్చిన వ్యక్తిగా కూడా ఆయన ప్రస్తుతం ఒక మంచి ఇమేజ్ ని పొందుతున్నాడు. ఇక వీళ్లిద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ గురించి వస్తున్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.