https://oktelugu.com/

Acharya Pre Release Event: ఆచార్య ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఫాన్స్ కి అదిరిపోయ్యే ప్రకటన చెయ్యబోతున్న చిరంజీవి – రాజమౌళి

Acharya Pre Release Event: మెగాస్టార్ చిరంజీవి హీరో గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కిన ఆచార్య సినిమా, అనేక వాయిదాల తర్వాత ఎట్టకేలకు ఈ నెల 29 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల అవ్వబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..చిరంజీవి మరియు రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్నా సినిమా కావడం తో ఈ మూవీ కోసం మెగా అభిమానులు ఎంతో కాలం […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 22, 2022 / 01:46 PM IST
    Follow us on

    Acharya Pre Release Event: మెగాస్టార్ చిరంజీవి హీరో గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కిన ఆచార్య సినిమా, అనేక వాయిదాల తర్వాత ఎట్టకేలకు ఈ నెల 29 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల అవ్వబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..చిరంజీవి మరియు రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్నా సినిమా కావడం తో ఈ మూవీ కోసం మెగా అభిమానులు ఎంతో కాలం నుండి ఆతృతగా ఎదురు చూస్తున్నారు..అంతే కాకుండా ఇప్పటి వరుకు ఈ సినిమా నుండి విడుదల అయినా పాటలు, టీజర్స్ మరియు ట్రైలర్ కూడా అభిమానులనే కాదు ప్రేక్షకులను కూడా ఎంతగానో ఆకట్టుకోవడం తో ఈ సినిమా మీద ఉన్న అంచనాలు ఇప్పుడు రెట్టింపు అయ్యాయి..ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 23 వ తారీఖున హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పెరేడ్ గ్రౌండ్స్ లో అశేష అభిమానుల సమక్షం లో ఘనంగా నిర్వహించబోతున్నట్టు ఇటీవలే ఆ చిత్ర బృందం అధికారికంగా ప్రకటించిన సంగతి మన అందరికి తెలిసిందే.

    Raja Mouli, Chiranjeevi

    ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి SS రాజమౌళి గారు ముఖ్య అతిధిగా హాజరు కాబోతున్నారు..అయితే ఇప్పుడు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జరగబొయ్యే ఒక్క ఆసక్తికరమైన ప్రకటన అభిమానులను కేరింతలు కొట్టేలా చేస్తుంది అని సోషల్ మీడియా లో ఒక్క వార్త జోరుగా ప్రచారం సాగుతుంది..అదేమిటి అంటే #RRR సినిమా షూటింగ్ సమయం లోనే చిరంజీవి మరియు రాజమౌళి కాంబినేషన్ లో ఒక్క సినిమా ని చెయ్యడానికి చర్చలు జరిగినట్టు సమాచారం..దీనికి సంబంధించిన స్టోరీ లైన్ ని కూడా రాజమౌళి చిరంజీవి గారికి వినిపించారు అట..ఆ స్టోరీ లైన్ చిరంజీవి కి బాగా నచ్చడం తో ‘స్క్రిప్ట్ సిద్ధం చెయ్యి..ఈ సినిమా మనం కచ్చితంగా చెయ్యాలి’ అని అన్నాడట..ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ఒక్క అధికారిక ప్రకటన రాజమౌళి నోటి నుండే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పబోతున్నారు అనే టాక్ వినిపిస్తుంది..అదే కనుక జరిగితే మెగా అభిమానులకు పండగే అని చెప్పొచ్చు.

    Also Read: MS Dhoni: ధోనీ ప్లాన్ వేస్తే ఎవ్వ‌రైనా ఔట్ కావాల్సిందే.. పోలార్డ్ విష‌యంలో మ‌రోసారి నిరూపితం..

    ఎందుకంటే వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఒక్క సినిమా వస్తే బాగుంటుంది అని అభిమానులందరూ ఎప్పటి నుండో కోరుకుంటూ వస్తున్నారు..కానీ చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లడం తో వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా రాలేదు అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపించే వార్త..మళ్ళీ ఇన్నాళ్లకు ఎట్టకేలకు వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఒక్క సినిమా రాబోతుంది అనే వార్త వస్తుండడం తో అభిమానుల ఆనందానికి హద్దులే లేకుండా పొయ్యింది..ప్రతుతం మెగాస్టార్ చిరంజీవి చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి..ఆచార్య సినిమా షూటింగ్ పూర్తి అయినా తర్వాత ఆయన మలయాళం లో మోహన్ లాల్ హీరోగా వచ్చిన లూసిఫెర్ అనే సూపర్ హిట్ సినిమాని ఇక్కడ గాడ్ ఫాదర్ అనే టైటిల్ తో రీమేక్ చేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కూడా ఒక్క ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు..ఈ సినిమాతోపాటుగా తమిళ్ లో సూపర్ హిట్ గా నిలిచినా అజిత్ మూవీ ‘వేదలమ్’ సినిమాని ఇక్కడ ‘భోళా శంకర్’ అనే పేరుతో రీమేక్ చేస్తున్నాడు..ఈ సినిమాకి మెహర్ రమేష్ దర్శకుడు..ఈ రెండు సినిమాలతో పాటుగా ప్రముఖ దర్శకుడు బాబీ తో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఒక్క సినిమా చెయ్యబోతున్నాడు..ఈ ప్రాజెక్ట్స్ అన్నీ పూర్తి అయినా తర్వాతనే రాజమౌళి తో సినిమా ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.

    Also Read: Prashant Kishor: పీకే వ్యూహాలు కాంగ్రెస్ ను గట్టెక్కిస్తాయా?

    Recommended Videos:

    Tags