Acharya Sensor Review: కొరటాల శివ దర్శకత్వం లో మెగాస్టార్ చిరంజీవి మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ఆచార్య సినిమా ఈ నెల 29 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల అవ్వబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..దాదాపుగా మూడేళ్ళ నుండి మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ మూవీ కరోనా కారణంగా మరియు ఆంధ్ర ప్రదేశ్ లో సర్దుబాటు కానీ టికెట్ రేట్స్ కారణంగా వాయిదా పడుతూ అభిమానుల సహనం కి పరీక్ష పెట్టిన సంగతి మన అందరికి తెలిసిందే..ఇన్నాళ్ల వారి ఎదురు చూపులకు మరో వారం రోజుల్లో తెరపడబోతుండడం తో వారి ఆనందానికి హద్దులే లేకుండా పొయ్యాయి అని చెప్పొచ్చు..ఇక ఇటీవలే ఈ సినిమా నుండి విడుదల చేసిన ట్రైలర్ కి అభిమానుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది..ఈ ట్రైలర్ లో చిరంజీవి మరియు రామ్ చరణ్ ని ఒక్కే షాట్స్ లో చూడడం కేవలం అభిమానులకే కాదు ప్రేక్షకులకు కూడా చాలా థ్రిల్ ఫీలింగ్ వచ్చింది..ఇక వెండితెర మీద ఈ ఇద్దరి కాంబినేషన్ చేసే మేజిక్ ఎలా ఉంటుందో చూడాలి.

ఇక ఈ సినిమాకి సంబంధించిన సెన్సార్ నిన్న సాయంత్రం హైదరాబాద్ లోని ప్రసాద్ లాబ్స్ లో జరిగింది..జీరో కట్స్ తో ఈ సినిమాకి సెన్సార్ వారు U/A రేటింగ్ ఇచ్చారు..ఈ సినిమాని చూసిన సెన్సార్ సభ్యులు మూవీ యూనిట్ ని ప్రశంసలతో ముంచి ఎత్తారు అట..చిరంజీవి గారిని ఈ సినిమా ద్వారా కొరటాల శివ చాలా కొత్తగా చూపించాడు అని..రామ్ చరణ్ మరియు చిరంజీవి గారు కలిసి ఉన్న సన్నివేశాలు చూడడానికి తమ రెండు కళ్ళు సరిపోలేదు అని , ఇంకా మెగా అభిమానులు థియేటర్స్ లో పూనకాలు వచ్చి ఊగిపోవడం ఖాయం అని సెన్సార్ సభ్యులు మూవీ యూనిట్ చెప్పిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి..ముఖ్యంగా ప్రీ ఇంటర్వెల్ నుండి క్లైమాక్స్ వరుకు సినిమా వేరే లెవెల్ లో ఉంది అని..ఇది కొరటాల శివ గారి కెరీర్ లోనే ల్యాండ్ మార్క్ సినిమాగా నిలిచిపోతుంది అని సెన్సార్ సభ్యులు కొనియాడారు అట.

అభిమానులందరూ రామ్ చరణ్ ఈ సినిమా లో కేవలం ఒక్క ప్రత్యేక పాత్రలో నటించాడు అని అనుకుంటూ ఉన్నారు..కానీ ఈ సినిమాలో సెకండ్ హాఫ్ మొత్తం కనిపిస్తాడు అని..ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ సినిమాని మెగా ముల్టీస్టార్ర్ర్ సినిమా గా కొరటాల శివ తీర్చిదిద్దారు అని తెలుస్తుంది..ఇది ఇలా ఉండగా ఇక ఈ సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్ గా నటించిన కాజల్ అగర్వాల్ సన్నివేశాలు ఉన్నాయా లేదా తీసేసారా అంటూ సోషల్ మీడియా లో ఒక్క ప్రచారం జోరుగా సాగుతుంది..ఇటీవల జరిగిన రామ్ చరణ్ మరియు కొరటాల శివ ఇంటర్వ్యూ లో కూడా మూవీ లో పని చేసిన ప్రతి ఒక్కరి గురించి మాట్లాడి , కాజల్ అగర్వాల్ గురించి మాత్రం ఒక్క ముక్క మాట్లాడకపోవడం తో అభిమానులు ఆమె పాత్ర ని సినిమాని తొలగించేసారా అంటూ వార్తలు వినిపిస్తున్నాయి..మరో ఇందులో ఎంత వరుకు నిజం ఉందొ తెలియాలి అంటే మరో వారం రోజులు వేచి చూడాల్సిందే.
Also Read: S S Rajamouli: రాజమౌళి చెప్పిన ఆ మార్పులు చెయ్యడం వల్లే రాధే శ్యామ్ అంత పెద్ద ఫ్లాప్ అయ్యిందా??
Recommended Videos:



[…] Megastar Chiranjeevi: తెలుగు సినిమా చరిత్రలో చిరంజీవికి ఓ ప్రముఖమైన స్థానం ఉంటుంది. ఆయన ఠాగూర్ సినిమాలో చెప్పినట్లు మనకోసం చరిత్రలో కొన్ని పేజీలు ఉంచుకున్నారు. తన నటనా కౌశలతో అబాలగోపాలాన్ని ఆకట్టుకున్న నటుడిగా ఆయన స్థానం పదిలమే. దశాబ్ధాల కాలంగా ఎదురులేని హీరోగా కెరీర్ ను నిలబెట్టుకున్న చిరుకు పోటీయే లేకుండా పోయింది. నటన, డాన్సులతో యువతరాన్ని ఉర్రూతలూగించడం ఆయనకే చెల్లు. […]
[…] Acharya Movie First Review: ఇప్పుడు టాలీవుడ్ అంతా ఆచార్య మూవీ చుట్టూ తిరుగుతోంది. అటు మీడియాలో, ఇటు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆచార్య వేవ్ స్పష్టంగా కనిపిస్తోంది. రోజుకో సస్పెన్స్ థ్రిల్లింగ్ న్యూస్‌తో హైప్ తీసుకువస్తున్నారు ఆచార్య మేకర్స్. ఇక ఇందులో మొదటి సారి చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటిస్తున్నారు. ఇద్దరూ కలిసి ఫుల్ లెంగ్త్ రోల్ లో నటిస్తున్న మొదటి మూవీ ఇదే. […]
[…] IPL 2022- Mukesh Choudhary: క్రికెట్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం ఎవ్వరి తరం కాదు. ఓటమి అంచుల నడుమ ఉన్న జట్టు అనూహ్యంగా విజయం సాధించవచ్చు. ఇప్పుడు ఐపీఎల్ లో ఇలాంటి అనూహ్య ఘటనలు చాలానే కనిపిస్తున్నాయి. చాంపియన్ టీమ్స్ అయిన చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ ఇప్పుడు అట్టడుగున ఉన్న సంగతి తెలిసిందే. అయితే చావో రేవో తేలాల్సిన నిన్నటి మ్యాచ్‌లో ఈ రెండు జట్లు తలపడ్డాయి. […]
[…] Also Read: Acharya Sensor Review: ఆచార్య సెన్సార్ రివ్యూ […]