https://oktelugu.com/

Megastar Chiranjeevi: చిరంజీవి సినిమానా మజాకా.. ఏకంగా చెప్పుల షాప్ పేరు మారిందిలా!

Megastar Chiranjeevi: తెలుగు సినిమా చరిత్రలో చిరంజీవికి ఓ ప్రముఖమైన స్థానం ఉంటుంది. ఆయన ఠాగూర్ సినిమాలో చెప్పినట్లు మనకోసం చరిత్రలో కొన్ని పేజీలు ఉంచుకున్నారు. తన నటనా కౌశలతో అబాలగోపాలాన్ని ఆకట్టుకున్న నటుడిగా ఆయన స్థానం పదిలమే. దశాబ్ధాల కాలంగా ఎదురులేని హీరోగా కెరీర్ ను నిలబెట్టుకున్న చిరుకు పోటీయే లేకుండా పోయింది. నటన, డాన్సులతో యువతరాన్ని ఉర్రూతలూగించడం ఆయనకే చెల్లు. కళాతపస్వి కె. విశ్వనాథ్ అద్భుత సృష్టికి తార్కాణంగా నిలిచిన స్వయంకృషిలో చిరంజీవి నటించారనే […]

Written By:
  • Srinivas
  • , Updated On : April 22, 2022 / 01:48 PM IST
    Follow us on

    Megastar Chiranjeevi: తెలుగు సినిమా చరిత్రలో చిరంజీవికి ఓ ప్రముఖమైన స్థానం ఉంటుంది. ఆయన ఠాగూర్ సినిమాలో చెప్పినట్లు మనకోసం చరిత్రలో కొన్ని పేజీలు ఉంచుకున్నారు. తన నటనా కౌశలతో అబాలగోపాలాన్ని ఆకట్టుకున్న నటుడిగా ఆయన స్థానం పదిలమే. దశాబ్ధాల కాలంగా ఎదురులేని హీరోగా కెరీర్ ను నిలబెట్టుకున్న చిరుకు పోటీయే లేకుండా పోయింది. నటన, డాన్సులతో యువతరాన్ని ఉర్రూతలూగించడం ఆయనకే చెల్లు.

    Megastar Chiranjeevi

    కళాతపస్వి కె. విశ్వనాథ్ అద్భుత సృష్టికి తార్కాణంగా నిలిచిన స్వయంకృషిలో చిరంజీవి నటించారనే కంటే జీవించారనడమే ఉత్తమం. ఎందుకంటే ఆయన చెప్పులు కుట్టే సాంబయ్య పాత్రలో రాణించారు. ఈ పాత్ర కోసం ఆయన ఏకంగా కొద్ది రోజులు శిక్షణ కూడా తీసుకున్నారంటే పాత్రపై ఆయనకు ఎంత మక్కువో తెలుస్తోంది. దీంతో ఆయన నటనకు ప్రభుత్వం తొలిసారి నంది అవార్డును సైతం అందజేయడం గమనార్హం.

    Also Read: Acharya Pre Release Event: ఆచార్య ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఫాన్స్ కి అదిరిపోయ్యే ప్రకటన చెయ్యబోతున్న చిరంజీవి – రాజమౌళి

    ఇందులో కథానాయికలుగా విజయశాంతి, సుమలత నటించారు. వారు కూడా పాత్రలకు జీవం పోశారు. చిత్ర విజయంలో కీలకంగా వ్యవహరించారు. దీంతో చిత్రం విజయవంతంగా ప్రదర్శితమైంది. చిరంజీవి కెరీర్ లోనే ఓ అద్భుతమైన కళాఖండంగా రూపుదిద్దుకుంది. 1987 సెప్టెంబర్ 3న విడుదలైన సినిమా అఖండ విజయాన్ని అందుకుంది. చిరంజీవి ఆశలకు జీవం పోసింది. తనలోని నటనకు విలువనిచ్చిన చిత్రంగా ఖ్యాతి గడించింది.

    Megastar Chiranjeevi

     

    స్వయంకృషి సినిమా చూసిన చాలా మంది తమ చెప్పుల దుకాణాలకు ఆ సినిమా పేరు పెట్టుకోవడం తెలిసిందే. ఎందుకంటే సినిమా వారి మీద అంతగా ప్రభావం చూపింది. దీంతో అప్పటిదాకా ఎవరు కూడా ధరించని పాత్ర కావడంతో అందరిలోకి సందేశం పంపినట్లు అయింది. దీంతోనే అందరు చెప్పుల దుకాణాల యజమానాలు తమ దుకాణాల పేరును స్వయంకృషి గా మార్చుకోవడం విశేషమే. ఒక సినిమా కూడా తన ప్రభావం సమాజం మీద చూపిస్తుంది. దీనికి నిదర్శనమే ఈ సినిమాగా రికార్డులకెక్కింది.

    Also Read:Prabhas: ప్రభాస్ వల్ల అట్టర్ ఫ్లాప్ అయిన ఎన్టీఆర్ మూవీ ఏమిటో తెలుసా..?

    Recommended Videos:

    Tags