Chiranjeevi three films same story: మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేసిన చాలా సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధించాయి. రీసెంట్ గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘మనశంకర్ వరప్రసాద్’ సినిమా సూపర్ సక్సెస్ ని సాధించింది. ఇక ఈ సినిమాతో మెగాస్టార్ మరోసారి తెలుగు సినిమా ఇండస్ట్రీకి తన సత్తా ఏంటో చూపించాడు. ఈ మూవీతో భారీ కలెక్షన్స్ ని కొల్లగొడుతూ సీనియర్ హీరోలందరి కంటే తను ముందు వరుసలో ఉన్నాడని నిరూపించుకున్నాడు… ఇక ఈ సినిమాలో చిరంజీవి పెళ్లై పిల్లలు పుట్టిన తర్వాత నయనతారతో దూరంగా ఉంటాడు. ఇక అందులోనే కామెడీ ఫ్యామిలీని మిళితం చేసి దర్శకుడు సినిమాని మలిచిన తీరు అద్భుతంగా ఉంది.
ఇక ఇలాంటి క్రమంలోనే దర్శకుడు ఈ సినిమాని సక్సెస్ తీరాలకు చేర్చడానికి పలు విధానాలను అనుసరించాడు… ప్రస్తుతం సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న చిరంజీవి మరో సినిమా పనిలో బిజీగా ఉన్నాడు. ఇక డైరెక్టర్ అనిల్ రావిపూడి సైతం మరో సినిమాతో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేయబోతున్నాడు.
ఈ సినిమాని పోలిన కథ తోనే చిరంజీవి గతంలో కొన్ని సినిమాలను చేశాడు. ముఖ్యంగా డాడీ, మృగరాజు లాంటి సినిమాల్లో అతను పిల్లలు పుట్టిన తర్వాత తన భార్యతో దూరంగా ఉంటూ వస్తాడు. ఇక పిల్లల ద్వారానే మళ్ళీ తన భార్య ను కలుసుకుంటాడు. మన శంకర్ వరప్రసాద్ సినిమాలో సైతం వాళ్ళ పిల్లతోనే చిరంజీవి నయనతార ఇంట్లోకి వచ్చి తనను మార్చి ఇద్దరు కలుసుకుంటారు.
ఇక మొత్తానికైతే చిరంజీవి ఒకే పాటర్న్ లో ఉండే మూడు కథలతో సినిమాలను చేసి ప్రేక్షకులను అలరించాడు. ఈ మూడు సినిమాల్లో మన శంకర్ వరప్రసాద్ సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఇప్పటివరకు 350 కోట్లకు పైన కలెక్షన్స్ ని కొల్లగొడుతూ ముందుకు దూసుకెళుతున్న ఈ సినిమా లాంగ్ రన్ లో భారీ కలెక్షన్స్ ను సాధించే అవకాశాలైతే ఉన్నాయి…ఇక ఇప్పటి వరకు చిరంజీవి కి ఏ డైరెక్టర్ అందించని ఒక గొప్ప సక్సెస్ ను అనిల్ రావిపూడి అందించాడు…