Chandrababu job claim: ఏ మనిషి అయినా సరే మాట్లాడుతున్నప్పుడు కొన్ని సందర్భాలలో తడబడుతుంటారు. మాట్లాడుతున్న క్రమంలో ఒత్తిడి లేదా యంగ్సైటి కి గురై తప్పుగా మాట్లాడుతుంటారు. కొన్ని సందర్భాలలో తప్పుడు గణాంకాలు చెబుతుంటారు. గతంలో ఇటువంటి వాటిని పెద్దగా పట్టించుకునేవారు కాదు. కానీ, మీడియా విస్తృతి పెరిగిపోయిన తర్వాత ఇటువంటి వాటికి విపరీతార్థాలు తీయడం.. పెరిగిపోయింది. ఆ తరహా వీడియోలను సోషల్ మీడియాలో సర్కులేట్ చేయడం అధికమైపోయింది. సోషల్ మీడియాకు బాధ్యత ఉండదు. కానీ, బాధ్యతాయుతమైన మీడియా సంస్థలు ఇటువంటి వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. కానీ, సోషల్ మీడియా మాదిరిగానే ప్రవర్తిస్తున్నాయి. పైగా సోషల్ మీడియాకు మించి దుమ్ము ధూళి ని పోగు చేస్తున్నాయి.
ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ వెళ్లారు. అక్కడ పెట్టుబడుల సదస్సులో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయనను ఎన్డీ టీవీ ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్వ్యూను రాహుల్ కాన్వాల్ చేశారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు 23 లక్షల ఉద్యోగాలకు బదులుగా 23 లక్షల కోట్ల ఉద్యోగాలు అని చెప్పారు .. అంతే ఆయన వెంటనే తన తప్పును గుర్తించారు. 23 లక్షల ఉద్యోగాలని చెప్పారు.
చంద్రబాబు ఇచ్చిన ఈ వివరణ స్పష్టంగానే ఉంది. కానీ, ఇక్కడ ఎన్డీ టీవీ తన మీడియా ధర్మాన్ని మర్చిపోయింది. చంద్రబాబు మాటలను అనుచితంగా ఎడిట్ చేసింది. ఎన్డీ టీవీ ఇలా చేయడం వల్ల చంద్రబాబు మీద విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది. దీనంతటికి ప్రధాన కారణం ఎన్డీ టీవీ వ్యవహరించిన తీరు. టీవీ లో లైవ్ టెలికాస్ట్ అయినప్పుడు చంద్రబాబు తను అన్న మాటను సరిదిద్దుకున్నారు. ఆ క్లిప్ ను ఎన్డ్ టీవీ టీవీ లో కట్ చేసి ప్రదర్శించింది. కానీ యూట్యూబ్ లో మాత్రం ఆ భాగాన్ని కట్ చేసి.. వీడియోను అప్లోడ్ చేశారు. వాస్తవాన్ని మీడియాకు ఉండాల్సిన నైతికతను పక్కనపెట్టి.. కేవలం వివాదానికి తావిచ్చే విధానానికి పాల్పడటం వల్ల ఇంతటి చర్చ జరుగుతుంది. పైగా ఆ వీడియోను ఎడిట్ చేయకుండా ఎన్డి టీవీ ప్రసారం చేయడం నిజంగా నైతికతను గాలికి వదిలేయడమే. ఒక ముఖ్యమంత్రి స్థాయి మాటలను వక్రీకరించడం.. ఆయన పై ట్రోలింగ్ కు కారణం కావడం.. ఎలాంటి విలువలకు నిదర్శనమో ఎన్డీ టీవీ నిర్వాహకులు చెప్పాలి.
రాహుల్ కాన్వాల్ అదే దావోస్ లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ను సిగ్గులేకుండా ఇంటర్వ్యూ చేశాడు. మెలికలు తిరిగిపోయాడు. చివరికి మీ మీద మంచు విసర వచ్చా అంటూ బీ గ్రేడ్ స్థాయిలో మాట్లాడాడు. కానీ, చంద్రబాబుపై ట్రోలింగ్ జరగడానికి ఏమాత్రం వెనుకాడ లేదు. చంద్రబాబు క్షమాపణ చెప్పడం ఆయన హుందాతనాన్ని ప్రదర్శిస్తోంది. కానీ బిబిసి అడ్డగోలుగా వ్యవహరించినందుకు ట్రంప్ వేలకోట్ల నష్టపరిహారాన్ని కోరారు. కానీ, చంద్రబాబు ఇక్కడ చేయంది అదే.