Nagarjuna sons: ‘శివ’ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో మొదటి బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సాధించిన నటుడు నాగార్జున… అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికి అతనికి మొదట్లో అనుకున్నంత సక్సెసులు రాలేదు. ఆ తర్వాత తన రూటు మార్చి డిఫరెంట్ తరహా సినిమాలను చేస్తూ వచ్చాడు. కాబట్టి తను వైవిధ్యమైన నటుడనే పేరు సంపాదించుకోవడమే కాకుండా సక్సెస్ లను సాధించాడు…ప్రస్తుతం నాగార్జున తన వందో సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకొని ముందుకు అడుగులు వేస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే తన కొడుకులు అయిన నాగచైతన్య, అఖిల్ సైతం ఇండస్ట్రీకి వచ్చి చాలా సంవత్సరాలు అవుతున్నప్పటికి ఇప్పటివరకు వాళ్ళు స్టార్ హీరోలుగా మారలేకపోతున్నారు..ఇక అఖిల్ అయితే ఒక సక్సెస్ ని సాధించడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాడు. ఇకమీదట రాబోయే సినిమాలతో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు… అక్కినేని అనే బ్రాండ్ ను నిలబెడుతాడా లేదా అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది… ఒకప్పుడు నాగార్జున చాలా మంది కొత్త డైరెక్టర్లకు అవకాశం ఇచ్చాడు.
వాళ్ళను నమ్మి చాలా వరకు ఎక్స్పరిమెంట్లు చేశాడు. అందువల్ల అతను వాటిలో సక్సెస్ ని సాధించి స్టార్ హీరోగా మారాడు. కానీ నాగచైతన్య, అఖిల్ అలాంటివేమీ చేయడం లేదు. మూస ధోరణిలో వెళ్తూ స్టార్ డైరెక్టర్లు ఏదైతే కథ చెబుతున్నారో వాటిని నమ్ముకొని ముందుకు సాగుతున్నాడు.
అందువల్లే వాళ్లకు భారీ సక్సెసులైతే రావడం లేదు. ఇక తన తోటి హీరోలందరు సూపర్ సక్సెస్ లను అందుకుంటుంటే వీళ్ళు మాత్రం ఒక సక్సెస్ ను సాధించడానికి నానా తంటాలు పడుతున్నారు. ఇక ఇప్పటికైనా నాగార్జున వీళ్ళ కెరియర్ విషయంలో ఎక్కువ చొరవ తీసుకుంటే బావుంటుందని పలువురు సినిమా మేధావులు చెబుతున్నారు.
నిజానికి అఖిల్ ఇండస్ట్రీకి రాకముందు తనకు చాలా మంచి క్రేజ్ ఉండేది. మనం సినిమా క్లైమాక్స్ లో వచ్చి మనం సినిమా క్రెడిట్ మొత్తాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. అయినప్పటికి తను హీరోగా మారినప్పటి నుంచి అతనికి ప్రేక్షకుల నుంచి సపోర్ట్ లభిస్తుంది. కానీ ఆయన నుంచి వచ్చే సినిమాలు ప్రేక్షకులను అలరించడం లేదు…