Homeఎంటర్టైన్మెంట్Chiranjeevi Lokesh Kanagaraj Missed Movie: చిరంజీవి , లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో మిస్...

Chiranjeevi Lokesh Kanagaraj Missed Movie: చిరంజీవి , లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో మిస్ అయిన సినిమా అదేనా..? చేసుంటే ఎలా ఉండేదో!

Chiranjeevi Lokesh Kanagaraj Missed Movie: మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) మామూలు కమర్షియల్ సినిమాలతోనే ఈ వయస్సులో కూడా ఇండస్ట్రీ రికార్డ్స్ ని బద్దలు కొడుతూ నేటి తరం స్టార్ హీరోలకు అందనంత ఎత్తులో ఉన్నాడు. అలాంటి మెగాస్టార్ చిరంజీవి , స్టార్ డైరెక్టర్స్ తో పాన్ ఇండియన్ సినిమాలు చేస్తే ఎలా ఉంటుంది?, ఊహించుకుంటేనే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి కదూ. అలా గతం లో ఆయన ఒక క్రేజీ స్టార్ డైరెక్టర్ తో సినిమా చేసే అవకాశం వస్తే , మిస్ కమ్యూనికేషన్ కారణం గా ఆ డైరెక్టర్ తో పని చేయలేకపోయాడట. ఆ డైరెక్టర్ మరెవరో కాదు , లోకేష్ కనకరాజ్(Lokesh Kanagaraj). ఈయన కెరీర్ సందీప్ కిషన్ ‘నగరం ‘ చిత్రం తో మొదలై , ఇప్పుడు ఏ స్థాయికి చేరిందో మన కళ్లారా చూస్తున్నాం. సౌత్ ఇండియా లో ఈయనకు ఉన్నంత క్రేజ్ మరో స్టార్ డైరెక్టర్ కి లేదు.

Also Read: విడాకులు తీసుకున్న హీరోయిన్ హన్సిక.. కారణం చూస్తే ఆశ్చర్యపోతారు!

యూత్ ఆడియన్స్ ఈయన మేకింగ్ స్టైల్ కి మెంటలెక్కిపోతుంటారు. అయితే ‘నగరం’ చిత్రం తర్వాత ఈయన ఒక్క సినిమా అవకాశం కోసం చెయ్యని ప్రయత్నం అంటూ ఏది లేదు. ఎంతో మంది హీరోలను కలిసి స్టోరీ ని వినిపించారు. కానీ ఒక్కరు కూడా అవకాశం ఇవ్వలేదు. మెగాస్టార్ చిరంజీవి ని కూడా ఈయన కలవడానికి చాలా ప్రయత్నాలే చేశాడట. తమిళ హీరో కార్తీ తో ఆయన చేసిన ‘ఖైదీ ‘ చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమా ని ముందుగా మెగాస్టార్ చిరంజీవి తోనే చెయ్యాలని అనుకున్నాడట లోకేష్ కనకరాజ్. అందుకు ఆయన కొంతమంది ద్వారా మెగాస్టార్ చిరంజీవి ని కలిసే ప్రయత్నం చేశాడు. కానీ ఆ ప్రయత్నాలన్నీ విఫలం అయ్యాయి. చివరికి ఈ కథ ని తమిళ హీరో కార్తీకి వినిపిస్తే ఆయన వెంటనే నచ్చి కాల్ షీట్స్ ఇచ్చేశాడు.

అలా మొదలైన ఈ సినిమా విడుదల తర్వాత క్రియేట్ చేసిన బాక్స్ ఆఫీస్ సునామీ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై, దాదాపుగా ఆరోజుల్లోనే 130 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. కార్తీ తో చేస్తేనే ఈ రేంజ్ గ్రాస్ వసూళ్లు వచ్చాయంటే , ఇక మెగాస్టార్ చిరంజీవి తో ఈ సినిమా చేసుంటే ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ అయ్యేవో మీరే ఊహించుకోండి. బహుశా మెగాస్టార్ ఈ చిత్రం చేసుంటే ఆరోజుల్లోనే 300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టి ఉండేవాడేమో. చాలా కాస్ట్లీ మిస్ అంటూ ఈ విషయాన్ని తెలుసుకున్న మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియా లో మెగాస్టార్ ని ట్యాగ్ చేసి కామెంట్స్ చేస్తున్నారు. మళ్లీ వీళ్లిద్దరి కాంబినేషన్ లో భవిష్యత్తులో అయినా సినిమా వస్తుందో లేదో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular