Chiranjeevi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి చాలా మంచి గుర్తింపైతే ఉంది. గత 50 సంవత్సరాలుగా ఆయన ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తూ ముందుకు దూసుకెళ్తుండటం విశేషం… ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కతాంశమైతే ఉంటుంది. యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకున్న మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు చేయబోతున్న సినిమాల విషయంలో సైతం చాలావరకు కసరత్తులైతే చేస్తున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా ఆయన చేస్తున్న సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిలపడమే కాకుండా 73 సంవత్సరాల పైబడిన వయసులో కూడా ఆయన ఇప్పటికి యంగ్ హీరోలతో పోటీ పడుతున్నాడు అంటే ఆయనకి సినిమాలంటే ఎంత ఇష్టమో మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తానికైతే చిరంజీవి లాంటి నటుడు ఈ మధ్యకాలంలో డిఫరెంట్ సినిమాలు చేస్తున్నాడనేది వాస్తవం… ఆయనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకున్న తర్వాత తను ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ ప్రస్తుతం చాలామంది ఆదర్శంగా నిలిచాడు. ఇండస్ట్రీకి రావాలనుకున్న ప్రతి ఒక్కరికి చిరంజీవి ఇన్స్పిరేషన్ గా నిలుస్తాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.అలాంటి చిరంజీవిని కొంతమంది దుర్భాషలాడుతూ ఇష్టం వచ్చినట్టుగా తిట్టారు. కొందరు ఆ తర్వాత క్షమాపణలు కూడా చెప్పారు.
ముఖ్యంగా ఇంద్ర సినిమాలాంటి సక్సెస్ ఫుల్ మూవీ కి కథని అందించిన చిన్ని కృష్ణ సైతం చిరంజీవిని తిట్టాడు. అప్పటినుంచి ఆయన్ని పట్టించుకునే వాళ్ళు లేకుండా పోయారు. ఎందుకంటే చిరంజీవి అంటే ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఉంది. కాబట్టి అలాంటి పెద్దాయనను పట్టుకొని అనవసరంగా మాటలు అనడం అతని అభిమానులు గాని, జనాలు గాని ఊరుకోరు.
అందువల్లే సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్లు సైతం వాళ్ళను పక్కన పెట్టేసారు. తన దగ్గర ఎన్ని కథలు ఉన్నాయని చెప్పినా కూడా అతని కథలను ఎవరు తీసుకోవడం లేదు. ఇక పోసాని కృష్ణ మురళి సైతం చిరంజీవిని మెగా ఫ్యామిలీని ఉద్దేశిస్తూ చాలా మాటలైతే మాట్లాడాడు.
అందుకని తనని కూడా ఇండస్ట్రీలో ఎవరు పట్టించుకోవడం లేదు…చిరంజీవి నిజాయితీగా తన పని తాను చేసుకుంటూ పోతాడు కాబట్టి ఆయనను తిట్టిన వారిని ఇండస్ట్రీలో ఉన్న ఎవరు పట్టించుకోరనేది వాస్తవం… తద్వారా వాళ్లకి రావాల్సిన అవకాశాలైతే రావు…