అప్పటి ముచ్చట్లు : ఆ హీరోకి అన్యాయం చేసిన మెగాస్టార్ చిరంజీవి !

విక్టరీ వెంకటేష్ సినీ కెరీర్ లో ‘చంటి’ సినిమా ఓ ప్రత్యేకమైన రోమాంటిక్ ఫ్యామిలి ఎంటర్టైనర్ గా నిలిచిపోయింది. దానికి కారణం ఈ సినిమా కథనే. జమిందారి కుటుంబంలో పుట్టిన అమ్మాయి నందిని (మీనా)కు ముగ్గురు అన్నయ్యలు (నాజర్‌, ప్రసన్న కుమార్‌, వినోద్‌). చిన్నతనం నుండి అన్నయ్యలే ఆమెను ఎంతో గారాబంగా ప్రేమగా పెంచుతారు. ఇక అదే ఊళ్లో పుట్టిన చంటి(వెంకటేశ్‌) పెద్ద అమాయకుడు. అతనికి తన తల్లే లోకం. ఆమె నేర్పడం ద్వారా పాటలు బాగా […]

Written By: Neelambaram, Updated On : January 11, 2021 12:23 pm
Follow us on


విక్టరీ వెంకటేష్ సినీ కెరీర్ లో ‘చంటి’ సినిమా ఓ ప్రత్యేకమైన రోమాంటిక్ ఫ్యామిలి ఎంటర్టైనర్ గా నిలిచిపోయింది. దానికి కారణం ఈ సినిమా కథనే. జమిందారి కుటుంబంలో పుట్టిన అమ్మాయి నందిని (మీనా)కు ముగ్గురు అన్నయ్యలు (నాజర్‌, ప్రసన్న కుమార్‌, వినోద్‌). చిన్నతనం నుండి అన్నయ్యలే ఆమెను ఎంతో గారాబంగా ప్రేమగా పెంచుతారు. ఇక అదే ఊళ్లో పుట్టిన చంటి(వెంకటేశ్‌) పెద్ద అమాయకుడు. అతనికి తన తల్లే లోకం. ఆమె నేర్పడం ద్వారా పాటలు బాగా పాడతాడు. ఇలాంటి వ్యక్తి, నందినికి రక్షకుడిగా వస్తాడు. అలా చంటిపై నందిని ప్రేమ పెంచుకుంటుంది. మరి చంటి-నందినిల ప్రేమ ఏమైంది? పెళ్లికి దారితీసిందా? అసలే కోపిస్టులైన నందిని అన్నయ్యలు చంటిని ఏం చేశారు? అనేదే మిగిలిన కథ తాలూకు గమనం.

Also Read: టాలీవుడ్ టార్గెట్ సమ్మర్.. ఏ సినిమా ఎప్పుడంటే !

కథ చెప్పుకోడానికి సింపుల్ గా ఉన్న.. సినిమాలో మంచి ఎమోషన్ ఉంది. రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ ‌బస్టర్‌ అయింది. కథతో పాటు నటీనటుల నటన కూడా అద్భుతంగా ఉండటంతో సినిమా మరో స్థాయిలో ఉంది. ముఖ్యంగా వెంకీ, మీనా, నాజర్‌, సుజాత, మంజుల, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రల్లో అద్భుతంగా నటించి మెప్పించారు. 1992 జనవరి 10న విడుదలైన ఈ చిత్రం నేటితో 29ఏళ్లు పూర్తి చేసుకోవడం విశేషం. కాగా తమిళంలో ఘన విజయం సాధించిన ‘చినతంబి’ని తెలుగులో ‘చంటి’గా తీశారు నిర్మాత కె.ఎస్‌.రామారావు.

Also Read: మళ్ళీ పొరపాటు చేసిన నాగబాబు !

అయితే తొలుత ఈ సినిమాలో మొదట హీరోగా రాజేంద్రప్రసాద్‌ అనుకున్నారట. రాజేంద్రప్రసాద్ కు కూడా నచ్చిందట. ‘చంటి’ పాత్రకు రాజేంద్రప్రసాద్‌ సరిపోతారని అందరూ భావించారు. ఇదంతా తమిళ ‘చినతంబి’ విడుదలకాక ముందు జరిగింది. అక్కడ ఆ సినిమా విడుదలవడం, బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని సాధించడంతో సురేశ్‌బాబు కె.ఎస్‌.రామారావు దగ్గరకు వచ్చి, వెంకటేశ్‌తో సినిమా చేయమని అడిగారు. ఆ సమయంలో చిరంజీవినే రవిరాజా పినిశెట్టిని ఒప్పించారట. ఈ విషయాన్ని రవిరాజా పినిశెట్టినే చెప్పారు. మొత్తానికి మెగాస్టార్, రాజేంద్రప్రసాద్ కి అన్యాయం చేశారు అన్నమాట. ఇక తమిళంలో నటించిన ఖుష్బూ ఈసారి తెలుగులో వెంకటేశ్‌తో చేసేందుకు అంగీకరించలేదు. దీంతో మీనాను తీసుకున్నారట. హిందీలోనూ చంటి పాత్రను వెంకటేశ్‌ చేయడం గమనార్హం.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్