https://oktelugu.com/

టాలీవుడ్ టార్గెట్ సమ్మర్.. ఏ సినిమా ఎప్పుడంటే !

సంక్రాంతి రాకముందు కొత్త సినిమాల ఆశలన్నీ మొన్నటివరకూ సంక్రాంతి పైనే. అందుకే, ముందుగానే సంక్రాంతికి దాదాపు ఎనిమిది సినిమాలను రిలీజ్ కి రెడీ చేస్తున్నామని అధికారికంగా రిలీజ్ తేదీలను కూడా ప్రకటించారు. చివరకు నాలుగు సినిమాలు మాత్రమే రిలీజ్ కి రెడీ అయ్యాయి. పైగా ఆ నాలుగు సినిమాల్లో ఒక సినిమా డబ్బింగ్ సినిమా. మిగిలిన మూడు సినిమాలు కూడా ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సినవి. సరే.. ఎలాగూ సంక్రాంతి మిస్ అవుతున్నాము కాబట్టి, ఇక నుండి మన […]

Written By:
  • Neelambaram
  • , Updated On : January 11, 2021 / 12:03 PM IST
    Follow us on


    సంక్రాంతి రాకముందు కొత్త సినిమాల ఆశలన్నీ మొన్నటివరకూ సంక్రాంతి పైనే. అందుకే, ముందుగానే సంక్రాంతికి దాదాపు ఎనిమిది సినిమాలను రిలీజ్ కి రెడీ చేస్తున్నామని అధికారికంగా రిలీజ్ తేదీలను కూడా ప్రకటించారు. చివరకు నాలుగు సినిమాలు మాత్రమే రిలీజ్ కి రెడీ అయ్యాయి. పైగా ఆ నాలుగు సినిమాల్లో ఒక సినిమా డబ్బింగ్ సినిమా. మిగిలిన మూడు సినిమాలు కూడా ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సినవి. సరే.. ఎలాగూ సంక్రాంతి మిస్ అవుతున్నాము కాబట్టి, ఇక నుండి మన టార్గెట్ సమ్మర్ కోసమే అంటూ మేకర్స్ హడావుడి చేస్తున్నారు మళ్ళీ.

    Also Read: మళ్ళీ పొరపాటు చేసిన నాగబాబు !

    ఒకటి కాదు, రెండు కాదు.. ఈసారి కూడా దాదాపు 12 సినిమాలు వేసవికే వస్తామంటూ ప్రకటనలు గుప్పించడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే కొన్ని సినిమాల విడుదల తేదీలను కూడా ప్రకటించారు. వచ్చే వారం మరో నాలుగు సినిమాల రిలీజ్ డేట్స్ ను ఎనౌన్స్ చేయనున్నారు. వాటిల్లో నితిన్ సినిమా కూడా ఉంది. సంక్రాంతికి వస్తామంటూ ప్రకటించిన రంగ్ దే సినిమాను సమ్మర్ కు వాయిదా వేశారు. మళ్ళీ ఏమైందో ఏమో మార్చి 26న థియేటర్లలోకి వస్తామంటూ మొత్తానికి రెండు నెలలు ముందుకు తీసుకువచ్చారు రిలీజ్ డేట్ ను. అలాగే రానా కూడా తన ‘అరణ్య’ సినిమాతో మార్చి 26న థియేటర్లలోకి వస్తానంటూ ఇప్పటికే చెప్పేశాడు.

    Also Read: ఈ ఏడాదికి మెగాస్టార్ సంపాదన 200 కోట్లు !

    ఇక నాని నటిస్తున్న టక్ జగదీష్ ను ఏప్రిల్ 16న థియేటర్లలోకి వస్తుందని ప్రకటించారు. అలాగే, పవన్ కల్యాణ్ నటిస్తున్న వకీల్ సాబ్ సినిమాను ఏప్రిల్ 9న రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. ఎలాగూ మే నెలలో చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమా రిలీజ్ కి సిద్ధం అవుతుంది. మరోపక్క ఫిబ్రవరి చివరి నాటికి చిన్న సినిమాలు నాలుగు ఐదు రానున్నాయి. ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధేశ్యామ్ కూడా వేసవిలోనే రిలీజ్ అయ్యేలా ఉంది. అదే విధంగా, మార్చిలో గోపీచంద్ సీటీమార్, సాయితేజ్ రిపబ్లిక్, శర్వానంద్ ద్వి-భాషా చిత్రం రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. మొత్తానికి వరుసగా సినిమాలు రిలీజ్ కానున్నాయి అన్నమాట.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్