https://oktelugu.com/

‘అల్లుడు’ ముందు రావడం పై గోల !

ఈ సంక్రాంతికి అదరగొట్టడానికి ‘అల్లుడు’ వస్తున్నాడు అంటూ బెల్లంకొండ శ్రీనివాస్ ‘అల్లుడు అదుర్స్’ టీం ప్రస్తుతం ఓ రేంజ్ లో ప్రమోషన్స్ చేస్తోంది. అయితే, మొదట జనవరి 15న ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. కాగా జనం థియేటర్స్ కి భారీగా వస్తారనే నమ్మకం పెరగడంతో.. తాజాగా రిలీజ్ డేట్ ను మార్చినట్లు తెలుస్తోంది. ఈ అల్లుడు అదుర్స్ సినిమాను ఓ రోజు ముందుకు జరుపుతున్నారట. అంటే.. ఈ నెల 14నే విడుదలకు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : January 11, 2021 / 12:36 PM IST
    Follow us on


    ఈ సంక్రాంతికి అదరగొట్టడానికి ‘అల్లుడు’ వస్తున్నాడు అంటూ బెల్లంకొండ శ్రీనివాస్ ‘అల్లుడు అదుర్స్’ టీం ప్రస్తుతం ఓ రేంజ్ లో ప్రమోషన్స్ చేస్తోంది. అయితే, మొదట జనవరి 15న ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. కాగా జనం థియేటర్స్ కి భారీగా వస్తారనే నమ్మకం పెరగడంతో.. తాజాగా రిలీజ్ డేట్ ను మార్చినట్లు తెలుస్తోంది. ఈ అల్లుడు అదుర్స్ సినిమాను ఓ రోజు ముందుకు జరుపుతున్నారట. అంటే.. ఈ నెల 14నే విడుదలకు రెడీ చేస్తున్నారు అన్నమాట. కాకపోతే ఇలా రిలీజ్ డేట్ మార్చడం పై మిగిలిన సినిమాల మేకర్స్ కాస్త అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.

    Also Read: అప్పటి ముచ్చట్లు : ఆ హీరోకి అన్యాయం చేసిన మెగాస్టార్ చిరంజీవి !

    థియేటర్స్ సమస్య వస్తోంది అనేది మిగిలిన సినిమాల మేకర్స్ అభిప్రాయం. ఇప్పుడు కొత్తగా డేట్ మార్చడం ఏమిటి అంటూ వాళ్ళు సీరియస్ అవుతున్నారు. అయినా, మార్కెట్ లో తమ ప్రోడక్ట్ ను ఎప్పుడు తీసుకురావాలో నిర్ణయించుకునే హక్కు.. ఆ వస్తువును తయారు చేసుకున్నవాడికే ఉండాలి. ఆ లెక్కనే అల్లుడు అదుర్స్ టీమ్ ముందుకు పోతుందట. ఇక ‘రాక్షసుడు’ సినిమాతో మంచి హిట్ అందుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ రెట్టించిన ఉత్సాహంతో సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే.

    Also Read: టాలీవుడ్ టార్గెట్ సమ్మర్.. ఏ సినిమా ఎప్పుడంటే !

    అన్నట్టు ఈ సినిమాలో సోనూ సూద్ కూడా ఒక ముఖ్యమైన పాత్ర చేస్తున్నాడు, మొదట విలన్ గా నటించడానికి ఒప్పుకున్న సోనూసూద్.. ఆ తరువాత తనకు వచ్చిన ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని, సినిమాలో తన పాత్రను పెంచమని కోరినట్లు తెలుస్తోంది. నిజానికి ఈ సినిమా ఎప్పుడో పూర్తి కావాలి, ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటెర్టైనర్ గా రానున్న ఈ సినిమా కూడా గతంలో సంతోష్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ‘కందిరీగ’ ఫార్మాట్లో ఉంటుందని తెలుస్తోంది. ‘కందిరీగ’లో మంచి ఫన్ ఉన్నట్టే.. ఈ అల్లుడు అదుర్స్ లో కూడా డీసెంట్ ఫన్ ఉంటుందట.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్