మా ఇంట్లో నలుగురికి కరోనా వచ్చింది : చిరంజీవి

కరోనా వస్తే భయపడాల్సిన అవసరం లేదని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ మహమ్మారిని సులభంగా ఎదుర్కోవచ్చన్నారు. కరోనా నుంచి కోలుకున్న వాళ్లు ప్లాస్మా దానం చేసి ప్రాణదాతలు కావాలన్నారు. సైబరాబాద్ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన ప్లాస్మా దాతల సన్మాన కార్యక్రమానికి చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 150 మంది ప్లాస్మా డోనర్లను ఆయన సన్మానించారు. ప్లాస్మా డొనేషన్‌ క్యాంప్‌ను ఏర్పాటు చేసిన సైబరాబాద్‌ సీపీ సజ్జనార్కు అభినందనలు తెలిపారు. కరోనాకు మందుగానీ, వ్యాక్సిన్‌ […]

Written By: Neelambaram, Updated On : August 8, 2020 11:01 am
Follow us on

కరోనా వస్తే భయపడాల్సిన అవసరం లేదని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ మహమ్మారిని సులభంగా ఎదుర్కోవచ్చన్నారు. కరోనా నుంచి కోలుకున్న వాళ్లు ప్లాస్మా దానం చేసి ప్రాణదాతలు కావాలన్నారు.

సైబరాబాద్ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన ప్లాస్మా దాతల సన్మాన కార్యక్రమానికి చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 150 మంది ప్లాస్మా డోనర్లను ఆయన సన్మానించారు.

ప్లాస్మా డొనేషన్‌ క్యాంప్‌ను ఏర్పాటు చేసిన సైబరాబాద్‌ సీపీ సజ్జనార్కు అభినందనలు తెలిపారు. కరోనాకు మందుగానీ, వ్యాక్సిన్‌ లేదని ఈ పరిస్థితుల్లో ప్లాస్మానే సంజీవనిలా పని చేస్తుందని చిరంజీవి అన్నారు. తమ బంధువుల కుర్రాడికి కూడా ప్లాస్మా ట్రీట్‌మెంట్‌ ఇప్పించి బ్రతికించుకున్నామని తెలిపారు .తన బంధువుకు ప్లాస్మా దానం చేసిన వ్యక్తి మరోవరో కాదని అఖిలభారత చిరంజీవి అభిమానుల సంఘం అధ్యక్షుడు స్వామి నాయుడు అని చెప్పారు. తాను కోరగానే వచ్చి ఆయన ప్లాస్మా దానం చేశాడని తెలిపారు.

Also Read: చిరంజీవితో వీర్రాజు బేటీ.. కారణమిదేనా?

‘కరోనాను జయించిన వారంతా ప్లాస్మా దానం చేసి మానవత్వాన్ని చాటుకోవాలి. వ్యాక్సిన్‌ వచ్చే వరకు మానవత్వమే మందు. కరోనాకు వ్యాక్సిన్‌ తెచ్చేందుకు కృషి చేస్తున్న సైంటిస్టులకు, ప్లాస్మా దానంతో ప్రాణాలు నిలబెడుతున్న వారి మనవత్వానికి ఇప్పుడు పోటీ నడుస్తోంది. ఇందులో మానవత్వం ఉన్న మనుషులే విజయం సాధించాలి’ అని ఆకాంక్షించారు.

కరోనాకు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఈ వైరస్‌ సోకితే తమకు ఏదో అయిపోతుందన్న భయంతో కొంత మంది ప్రాణాలు తీసుకుంటున్నారని తెలుసుకున్నానని చెప్పారు. కొన్నాళ్లు పోతే ఇది జలుబులాగా, దగ్గులాగా అయిపోతుందన్నారు. తన ఇంట్లోనే నలుగురు కరోనాను జయించారని తెలిపారు. ‘కరోనా గురించి అనవసర భయాలు వద్దు. జాగ్రత్తలు పాటిస్తే కచ్చితంగా కోలుకుంటారు. నా ఇంట్లోనే.. నా వద్ద పని చేసే నలుగురికి కరోనా సోకింది. మా వంట శ్రీను, అతని కుమారుడు, కూరగాయలు తరిగే మహిళ. స్విమ్మింగ్‌ పూల్‌ క్లీన్‌ చేసే లక్ష్మణ్‌కు నెల రోజుల కిందట కరోనా వచ్చింది.

Also Read: సోము వీర్రాజు దూకుడు వెనుక ఉన్న అసలైన టార్గెట్ వీరే…!

అజాగ్రత్త కారణంగానే వీరికి వైరస్‌ సోకింది. వాళ్లందరినీ ఒక ఫ్లాట్‌లో ఉంచి క్వారంటైన్‌ ఏర్పాటు చేశా. మందులేమీ లేకున్నా తగిన జాగ్రత్తలతో వైరస్‌ను జయించారు. కోలుకున్న తర్వాత ఇంట్లో తిరిగి పనికి పెట్టుకున్నాం. ఈ నలుగురిని ఇక్కడకు తీసుకొచ్చా. ఇప్పుడు ప్లాస్మా దానం చేస్తారు. ఒక్కరు ప్లాస్మా దానం చేస్తే ముగ్గురి ప్రాణాలను కాపాడొచ్చు. కాబట్టి తెలుగు రాష్ట్రాల ప్రజలకు నేను చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా. కరోనా నుంచి కోలుకున్న వాళ్లు దయచేసి ప్లాస్మా దానం చేయండి’ అని చెప్పుకొచ్చారు. ఈ కష్టకాలంలో ముందుండి పోరాడుతున్న పోలీసులు, డాక్టర్లు, , పారిశుద్ధ్య సిబ్బందికి చిరు ధ‌న్యవాదాలు తెలిపారు.